Sowmya Rao: ‘జబర్దస్త్’ కొత్త యాంకర్ కి ఇదివరకే పెళ్లయిందా..బయటపడ్డ షాకింగ్ విషయాలు..!

‘జబర్దస్త్’ షోలో ఈ మధ్య ఎక్కువ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ కమెడియన్స్ కొంతమంది షో నిర్వాహకులతో గొడవలు పెట్టుకుని వెళ్లిపోవడం.. పాత జడ్జిలు లేక రేటింగ్లు తగ్గిపోవడం వంటివి జరుగుతున్నాయి. యాంకర్ ల విషయంలో కూడా ఇలాంటి సీనే రిపీట్ అయ్యింది. అనసూయ ఆల్రెడీ షో నుండి తప్పుకుంది. రష్మీ నెట్టుకొస్తోంది అనుకుంటున్న టైంలో కొత్త యాంకర్ వచ్చి చేరింది.ఆమెనే సీరియల్ నటి సౌమ్య రావు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఈమె సొంతం.

అయినప్పటికీ సీరియల్స్ లో విలన్ రోల్స్ ఎక్కువగా చేస్తూ వచ్చింది. అయితే ఈమె సడన్ గా జబర్దస్త్ లో యాంకర్ గా ప్రత్యక్షమవడంతో ఈమె గురించి ప్రేక్షకులు ఎక్కువగా ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఈమె లైఫ్ లో చాలా ట్రాజెడీ ఉన్నట్టు ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. 1990వ సంవత్సరంలో కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో సౌమ్య జన్మించింది. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. ఓ న్యూస్ రీడర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈమె మరోవైపు మోడలింగ్ లో కూడా సత్తా చాటేది.

తర్వాత ‘పట్టేదారి ప్రతిభ’ అనే సీరియల్ తో ఈమె నటిగా మారింది. ఆ సీరియల్ తో ఈమె మెప్పించడంతో సన్ టీవీ లో ‘రోజా’ అనే సీరియల్ లో లీడ్ రోల్లో నటించే అవకాశం కొట్టేసింది. తమిళంలో కూడా ఈమె పలు సీరియల్స్ లో నటించింది. ‘శ్రీమంతుడు’ అనే సీరియల్ తో ఈమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంకా పలు సీరియల్స్ లో నటించింది. అన్నీ నెగిటివ్ రోల్సే..! సౌమ్య రావు అసలు పేరు సౌమ్య శారద.

ఈమె చిన్నప్పుడే తన తండ్రి ప్రేమకు దూరమైంది. తల్లికి క్యాన్సర్.కొన్నేళ్లపాటు ఈమె తన తల్లికి సేవలు చేస్తూ వచ్చేది.2019లో తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అలాగే బంధువు అయిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నప్పటికీ ఆమె పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఈమె ఎక్కువ బయటపెట్టడం లేదు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus