Satya Sri: ఈ పాట కోసం 15 టేకులు తీసుకున్నాను.. ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం రాలేదు!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో కమెడియన్ సత్య శ్రీ ఒక్కరు ఈమె చమ్మక్ చంద్ర టీం లో కమెడియన్ గా పనిచేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే కొంతకాలం పాటు ఈ కార్యక్రమంలో కొనసాగిన సత్య శ్రీ అనంతరం కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్నారు. ఇక ఈమె ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలో కూడా ఈమె కానిస్టేబుల్ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాలో పెట్టే తాళం అనే పాట పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డబుల్ మీనింగ్ డైలాగులతో ఉన్నటువంటి ఈ పాట సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ పాటలో జబర్దస్త్ నటి సత్య శ్రీ నటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ పాట గురించి తాజాగా ఈమె మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

డైరెక్టర్ వక్కంతం వంశీ గారు నాకు ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు పాట ఉంటుందనే విషయాన్ని చెప్పలేదని ఈ పాట రేపు షూట్ చేద్దాము అనగా ముందు రోజు నాకు ఈ పాట గురించి చెప్పారని తెలియజేశారు. ఇలా సడన్గా చెప్పేసరకు నాకేమీ అర్థం కాలేదంటూ ఈమె తెలిపారు. ఇక ఈ పాట మొదట్లో తాను చేయనని చెప్పగా ఇందులో ఎలాంటి వలిగారిటీ లేదని డైరెక్టర్ గారు అలాగే శేఖర్ మాస్టర్ నన్ను కన్విన్స్ చేశారు.

ఈ పాట ద్వారా మనం ఎలాంటి గ్లామర్ షో చేయలేదని చెప్పడంతో ఈ పాటకు డాన్స్ చేశామని అయితే ఈ పాటకు డాన్స్ చేసే సమయంలో సరైన ఎక్స్ప్రెషన్స్ పెట్టడం రాక దాదాపు 15 టేకులు తీసుకున్నాను అంటూ ఈ సందర్భంగా సత్య శ్రీ (Satya Sri) పెట్టే తాళం పాట గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus