బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ… చాలా చక్కగా షోను నిర్వహించిన భేష్ అనిపించుకున్నారు. అయితే ఈ ఏడాది కరోనా ఇంకా దారుణంగా ఉండటంతో నిర్వాహకులు జంకుతున్నారట. మరోవైపు కరోనా మార్గదర్శకాలను అతిక్రమించారని మలయాళ బిగ్‌బాస్ సెట్‌ను పోలీసులు సీజ్ చేసి, షోను నిలిపేశారు. దీంతో తెలుగు షో విషయంలో ఇంకా ఆలస్యం చేయాలని చూస్తున్నారట. ఇదంతా పక్కనపెడితే షోకి ఎవరెవరిని తీసుకోవాలనే చర్చ ఇంకా జరుగుతోందట.
కరోనా పరిస్థితులు సద్దుమణిగితే వీలైనంత తర్వగా షో ప్రారంభించాలి కాబట్టి… ముందుగానే పార్టిసిపెంట్స్‌తో మాట్లాడి సిద్ధం చేయాలని నిర్వాహకులు చూస్తున్నారట. ఈ క్రమంలో జబర్దస్త్ బ్యూటీ వర్షను సంప్రదించారని టాక్. జబర్దస్త్‌లో కాస్త పద్ధతిగా కనిపించినా, సోషల్ మీడియాలో మాత్రం వర్ష హాట్ పోజులతో కుర్రకారును హీటెక్కిస్తుంటుంది. ఈమెను టీవీ కోటా కింద బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలని చూస్తున్నారట. ఒకవేళ ఆ కోటాలో ఇంకెవరైనా ఉంటే సోషల్ మీడియా కోటా ఎలాగూ ఉంది.

వర్ష సోషల్ మీడియా పోస్టులు చూస్తే… అందాల ప్రదర్శనకు ఏమాత్రం అడ్డు చెప్పే పరిస్థిత ఉండదు. మరోవైపు బిగ్‌బాస్ హౌస్‌లో ఆర్టిఫిషియల్ అఫైర్ పెట్టుకోవాలన్నా ఓకే అంటుందేమో. ఇప్పటికే జబర్దస్త్‌లో ఇమ్మాన్యుయేల్‌తో అలాంటి ట్రాక్ ఒకటి రన్ అవుతోంది. కాబట్టి వర్షను తీసుకుంటే రెండు విధాలుగా ఉపయోగమే అని బిగ్‌బాస్ బృందం ఆలోచిస్తుండొచ్చు.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70

Most Recommended Video
10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!
