Vinod: యజమానితో గొడవ.. పోలీసులను ఆశ్రయించిన కమెడియన్!

‘జబర్దస్త్’ షోలో కమెడియన్ గా ప్రేక్షకులను దగ్గరైన వినోద్ అలియాస్ వినోదిని.. ఇంటి గొడవ మరోసారి వీధికెక్కింది. ఇంటి కొనుగోలు విషయంలో యజమానితో ఏర్పడిన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆయన తనకు న్యాయం చేయాలని కోరుతూ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డిని కలిసి విన్నవించాడు. ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న అద్దె ఇంటిని విక్రయిస్తానని యజమాని రూ.40 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడని చెప్పాడు. ఏడాది క్రితం రూ.13. లక్షలు అడ్వాన్స్ కూడా యజమానికి ఇచ్చినట్లు వినతిపత్రంలో పేర్కొన్నాడు.

ఇప్పుడు అగ్రిమెంట్ కుదుర్చుకున్న ప్రకారం రూ.40 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఇస్తేనే ఇల్లు అమ్ముతానని గొడవ పడుతున్నారని వినోద్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ యజమాని అడిగినంత ఇవ్వకపోతే తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వనని బెదిరిస్తున్నట్లు వినోద్ వాపోయాడు. గతంలో ఇదే విషయంపై ఇంటి యజమాని దాడి చేసిన విషయాన్ని డీసీపీ దృష్టికి తీసుకెళ్లాడు.

హైద‌రాబాద్‌లోని కుత్బిగూడ‌ అనే ప్రాంతంలో అద్దెకి ఉంటోన్న ఇంటిని వినోద్ రూ.40 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసిన నేప‌థ్యంలో య‌జ‌మానితో గొడ‌వ జరిగింది. ఈ క్రమంలో 2019 జూలైలో వినోద్ పై దాడి జరిగింది. అప్పట్లో కాచిగూడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా… ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దయచేసి తనకు న్యాయం చేయాలని డీసీపీకి అందించిన వినతిపత్రంలో రాసుకొచ్చాడు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus