Vinodhini: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన జబర్దస్త్ వినోదిని!

‘జబర్దస్త్’ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. దీని ద్వారా సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇదిలా ఉండగా.. చమ్మక్ చంద్ర స్కిట్స్ లో లేడీ గెటప్స్ వేస్తూ పాపులర్ అయిన కమెడియన్స్ లో వినోద్ ఒకడు. జబర్దస్త్ ఫ్యాన్స్ ఇతన్ని వినోదినిని చేశారు. ఇతను కొన్నాళ్లుగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటం లేదు. అయితే సడన్ గా ఇతను ఓ ఇంటర్వ్యూలో కనిపించి షాకిచ్చాడు.

ఎందుకంటే అందులో ఇతని లుక్ గుర్తు పట్టలేని విధంగా ఉంది. దీనిపై అతను స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘జబర్దస్త్’ వినోద్ మాట్లాడుతూ.. “నేను ఊపిరితిత్తుల వ్యాధి(లంగ్స్ ఇన్‌ఫెక్షన్‌)తో బాధపడుతున్న సంగతి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. 2 ఏళ్ళ నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను.అయితే ఊపిరితిత్తుల్లో నీరు పేరుకుపోవడంతో ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. అది ఆలస్యంగా తెలిసింది. ఈ కారణం వల్లే నేను బరువు తగ్గిపోయాను. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు.

కానీ ఒక నెలలోనే చాలా వెయిట్‌ లాస్ అవ్వడంతో డౌట్ వచ్చి టెస్టులు చేయించుకుంటే ఈ ఇన్ఫెక్షన్ గురించి తెలిసింది. వెంటనే లంగ్స్ నుంచి నీరు తీసేసే ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాను. ఫుడ్‌ సరిగా తీసుకోకపోవడం, బయట జంక్‌ ఫుడ్‌ తినడం కూడా దీనికి కారణమయ్యింది.ఇలాంటి పరిస్థితుల్లో నేను బాధపడుతున్నప్పుడు..

మంత్రి రోజా (Roja) కూడా నాకు అండగా నిలబడ్డారు. ఎప్పటికప్పుడు నా హెల్త్ అప్డేట్ తెలుసుకుంటూనే చాలా సపోర్ట్ చేశారు. అందరి సపోర్ట్ ఉండటం వల్లే చావు అంచుల వరకు వెళ్లి మరీ తిరిగి కోలుకున్నాను. ఇప్పుడిప్పుడు మళ్లీ షోస్‌ లో ఛాన్సులు వస్తున్నాయి, వర్క్ లోకి దిగి బిజీ కావాలని కోరుకుంటున్నాను” (Vinodhini) అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus