బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గత కొంత కాలం నుంచి మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సుకేష్ చంద్ర శేఖర్ ప్రధాన నిందితుడిగా ఎదుర్కొంటున్న 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో భాగంగా నటి జాక్వెలిన్ ను ఈడి అధికారులు నిందితురాలుగా గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై అధికారులు ఢిల్లీ కోర్టుకు సమర్పించిన సప్లమెంటరీ చార్జిషీట్లో భాగంగా జాక్వెలిన్ పేరు నమోదు చేశారు. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లను 200 కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో భాగంగా సుఖేష్ చంద్రశేఖర్ ను ప్రధాన నిందితుడుగా అధికారులు భావించి విచారణ చేపట్టారు.
ఈ క్రమంలోనే సుఖేష్ చంద్రశేఖర్ తో నటి జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నాయని తెలియడంతో అధికారులు ఈమెను కూడా పలుసార్లు విచారణ చేశారు.ఇకపోతే నటి జాక్వెలిన్ సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఎన్నో ఖరీదైన బహుమతులను తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తామని వారి భార్యలను నమ్మించి షోకేస్ చంద్రశేఖర్ వారి నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేసే అనంతరం బెయిల్ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ దారుణంగా మోసం చేశారు.
ఈ క్రమంలోనే తమ డబ్బును తిరిగి ఇవ్వకుండా తమ భర్తకు బెయిల్ కూడా ఇప్పించకపోవడంతో శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గత ఏడాది పోలీసులు సుఖేష్ చంద్రను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఈ కేసు విషయంపై విచారణ చేపట్టగా ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి.ఈ క్రమంలోనే జాక్వెలిన్ పేరు కూడా బయటకు రావడంతో అధికారులు ఈమెను కూడా విచారించారు.
అయితే ఈ కేసులో తనకు భాగం ఉందని తెలియడంతో ఈడీ అధికారులు తనని నిందితురాలుగా గుర్తించారు.గతంలో జాక్వెలిన్ తనకు సుఖేష్ చంద్రశేఖర్ తో ఏ విధమైనటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ ఆమె అతనితో ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఆయన షేర్ చేయడంతో అప్పట్లో ఇవి వైరల్ అయ్యాయి. అయితే తాజాగా చార్జిషీట్లో ఈమె పేరును ఈడీ అధికారులు పొందుపరిస్తూ నిందితురాలిగా గుర్తించారు.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?