Jacqueline Fernandez: నా ప్రైవసీకి భంగం కలిగించొద్దు.. హీరోయిన్ ఆవేదన..!

శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. కాన్ మ్యాన్ సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పలు బాలీవుడ్ హీరోయిన్లతో పాటు జాక్వెలిన్ కి సుఖేష్ ఖరీదైన బహుమతులు ఇవ్వడంతో ఈడీ ఆమెని విచారించింది. అప్పటి నుంచి మీడియాలో జాక్వెలిన్ పేరు వినిపిస్తూనే ఉంది. మొన్నామధ్య ఆమె ఇండియా నుంచి వేరే దేశానికి వెళ్లడానికి ప్రయత్నించగా.. అధికారులు అడ్డుకున్నారు.

సుఖేష్ తో జాక్వెలిన్ క్లోజ్ గా ఉన్న సెల్ఫీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు రాగా.. జాక్వెలిన్ వాటిని కొట్టిపారేసింది. తాజాగా జాక్వెలిన్ కి సంబంధించిన మరో ప్రైవేట్ ఫొటో బయటకొచ్చింది. ఇందులో సుఖేష్ ఆమెని ముద్దాడుతూ కనిపించాడు. ఇద్దరూ ఒకే బెడ్ పై ఉన్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది జాక్వెలిన్ ని ట్రోల్ చేస్తున్నారు.

దీంతో ఆమె మీడియాకు విన్నవించుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది. సుఖేష్ తో లీక్ అయిన ఫొటోను ప్రసారం చేయొద్దని మీడియాను రిక్వెస్ట్ చేసింది. ‘ఈ దేశం, ఈ ప్రజలు నాకు విపరీతమైన ప్రేమ, గౌరవాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం నేను కఠినమైన పరిస్థితిలో ఉన్నాను. అది నా స్నేహితులు, అభిమానులు గమనిస్తూనే ఉన్నారని తెలుసు. ఈ నమ్మకంతోనే నా వ్యక్తిగత చిత్రాలను ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులను అభ్యర్థిస్తున్నాను. నేను ఇప్పటికే చాలా నేర్చుకున్నాను.

నా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తున్నాను. మీరు మీ ప్రియమైన వారికి ఇలా చేయరు కదా. అలాగే నాకు కూడా ఇలా చేయరని నమ్ముతున్నా. న్యాయం, మంచి గెలుస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.’ అంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus