Jagame Thandhiram Trailer: మరో ఇంటెన్స్ డ్రామాతో ధనుష్!

కోలీవుడ్ హీరో ధనుష్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో సినిమాకి వైవిద్యం చూపిస్తూ నటుడిగా తన సత్తా చాటుతున్నారు. ఈ ఏడాది ‘కర్ణన్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ధనుష్. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా ఎగబడి చూశారు. ఇప్పుడు ధనుష్ నుండి మరో సినిమా రాబోతుంది. అదే ‘జగమే తంత్రం’. నిజానికి ఈ సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు

కానీ కరోనా కారణంగా మరింత ఆలస్యం అవుతుందని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. తమిళనాడు నుండి లండన్ కు వెళ్లి అక్కడ మాఫియా నాయకుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథే ఈ సినిమా. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కించారు. ‘కర్ణన్’ సినిమాలో దళిత యువకుడి పాత్ర పోషించిన ధనుష్ ఇప్పుడు గ్యాంగ్ స్టర్ గా కనిపించడానికి రెడీ అవుతున్నాడు.

ట్రైలర్ ను చూస్తుంటే సినిమాను చాలా రిచ్ గా డిఫరెంట్ స్టైల్ లో తెరకెక్కించినట్లు అనిపిస్తోంది. ఈ నెల 18న నెట్ ఫ్లిక్స్ లో నేరుగా సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి!


ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus