యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎటువంటి వివాదాలకు పోకుండా తన పని తాను హ్యాపీగా చేసుకుంటూ పోతున్నాడు. తన అభిమానులను అలరించేలా సినిమాలు చేసుకోవడమే తన పనిగా భావిస్తున్నాడు. ఇంకా ఇంకా తన అభిమానులు గర్వపడేలానే సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు.ఏది ఉన్నా సినిమాల ద్వారానే సాధించాలి అని కష్టపడుతున్నాడు. రాజకీయాల విషయానికి వస్తే.. తనకి సంబంధం లేదని డైరెక్ట్ గానే చెప్పేస్తున్నాడు. తనకి రాజకీయాలు పడవని.. తనకి ఏ అనుభవం లేదని.. తెలిసిన కొన్ని విషయాలు కూడా జనాలకి ఏమాత్రం ఉపయోగపడవని, అలాంటప్పుడు జనాలను ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదని డిసైడ్ అయినట్టు చాలా సార్లు చెప్పుకొచ్చాడు.
అయితే ఎన్టీఆర్ ను కొంతమంది అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు. దాని ద్వారా ఎన్టీఆర్ పై అనవసరంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు దేశం పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఎన్టీఆర్ పై ఉందని, అతను వస్తేనే ఆ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కొందరు భావిస్తున్నారు.అంతా బాగానే ఉంది కానీ జగన్ ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పడం ఏంటి అనే అనుమానం అందరికీ రావచ్చు. దానికి ప్రధాన కారణం అంబటి రాంబాబు అనే చెప్పాలి.
ఆయన టీడీపీ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబు, లోకేశ్ ఈ రాష్ట్రానికి పట్టిన శని అని. ఇది మేము అంటున్న మాట కాదు. లోకేష్ బాబు పోతే జూనియర్ ఎన్టీఆర్ లేదా బోనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని టీడీపీ నేతలు అంటున్నారు అంటూ మంత్రి అంబటి నోరు పారేసుకున్నాడు. ఇవి ఎన్టీఆర్ అభిమానులకు కోపం తెప్పించాయి. దీంతో అంబటి నోటి దురుసు మాటలకు గాను ఎన్టీఆర్ కు అతను క్షమాపణలు చెప్పాలనే జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ట్విట్టర్ వేదికగా వారు #JaganShouldApologizeJrNTR అనే హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. దాంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయం పై జగన్ స్పందిచే అవకాశాలు లేవు. మరి అభిమానులు ఈ విషయాన్ని వదిలేస్తారా లేక ఇంకా ఇంకా రెచ్చగొడతారా? అనేది చూడాలి..!