Jagapathi Babu, Salaar2: సలార్2 పై షాకింగ్ అప్ డేట్స్ ఇచ్చిన జగపతిబాబు.. చెప్పిన విషయాలివే!

సలార్1 (Salaar) మూవీ 2023 సంవత్సరంలో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాదాపుగా 730 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే సంగతి తెలిసిందే. సలార్ సినిమాలో రాజమన్నార్ పాత్రలో జగపతిబాబు అద్భుతంగా నటించారు. సలార్1 లో జగపతిబాబు పాత్రకు ప్రాధాన్యత తక్కువే అయినా ఆయన రోల్ ను ప్రశాంత్ నీల్ (Prashanth Neel) పవర్ ఫుల్ గా చూపించారు. త్వరలో సలార్2 సినిమా షూటింగ్ మొదలుకానున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు (Jagapathi Babu) సలార్2 సినిమాపై అంచనాలు పెరిగేలా కామెంట్లు చేశారు. సలార్2 సలార్1 మూవీని మించి ఉంటుందని చెప్పుకొచ్చారు. తనకు, ప్రభాస్ కు మధ్య సినిమాలో భారీ సీన్స్ ఉంటాయని ఆయన కామెంట్లు చేశారు. సినిమాలో మ్యాజిక్ ను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తారని జగపతిబాబు వెల్లడించారు. సలార్2 సినిమాపై అంచనాలను మరింత పెంచేలా జగపతిబాబు కామెంట్లు చేయగా 2025 చివర్లో ఈ సినిమా రిలీజ్ కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ మాత్రం సలార్2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. సలార్2 సినిమాలో వార్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని భోగట్టా. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సలార్2 సినిమా షూట్ ను వీలైనంత వేగంగా పూర్తి చేసేలా ప్రశాంత్ నీల్ ప్రణాళిక ఉంది.

సలార్1 విషయంలో వచ్చిన కొన్ని నెగిటివ్ కామెంట్లను పరిగణనలోకి తీసుకుని ప్రశాంత్ నీల్ సలార్2 సినిమా స్క్రిప్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారని సలార్2 లో ప్రభాస్ కు డైలాగ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయని సమాచారం అందుతోంది. సలార్2 ప్రభాస్ మార్కెట్ ను మరింత పెంచాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus