నటీనటులు సినిమాల కోసం మేకోవర్ మార్చుకోవడం అనేది కొత్త విషయం కాదు. అయితే సినిమాలో ముఖ్య పాత్ర పోషించే వాళ్లకి మాత్రమే మేకోవర్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. లేదు అంటే వాళ్ళ రెగ్యులర్ గెటప్లలోనే చూపించి పంపించేస్తుంటారు. కొంతమంది దర్శకులు హీరోలకి తప్ప మిగతా ఆర్టిస్టులకి మేకోవర్ మార్చడాలు వంటివి చేయరు. కానీ కొందరు మాత్రం చాలా పర్టిక్యులర్ గా ఉంటారు.
వాళ్లలో ఒకరు సుకుమార్. అవును సుకుమార్ సినిమాల్లో హీరోలు మాత్రమే కాదు.. మిగతా నటీనటులకు కూడా సమాన ప్రాధాన్యత ఉంటుంది. ‘రంగస్థలం’ లో జగపతి బాబు(Jagapathi Babu) పాత్రని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో జగపతి బాబు చాలా కొత్తగా కనిపించారు. అతని బాడీ లాంగ్వేజ్ కానీ, గెటప్, హెయిర్ స్టైల్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్ని రకాలుగా కొత్తగా కనిపించి అలరించారు. అందుకే ఫణింద్ర అనే పాత్ర అందరికీ గుర్తుండిపోయింది.

ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ జగపతి బాబు మరో సినిమాలో చేసింది లేదు.ఇప్పుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దాన్ని బ్రేక్ చేయాలని డిసైడ్ అయినట్టు ఉన్నాడు. అందుకే రామ్ చరణ్ తో చేస్తున్న ‘పెద్ది’ సినిమా కోసం జగపతి బాబుని తీసుకున్నాడు. ఈ సినిమాలో అప్పల సూరి అనే పాత్రలో జగపతి బాబు కనిపించబోతున్నాడు. తాజాగా అతని పాత్రకు సంబంధించిన లుక్ ను వదిలారు.
ఆ లుక్ చూస్తే ఎవ్వరికైనా మైండ్ పోవడం గ్యారెంటీ. ఎందుకంటే అంత కొత్తగా ఉంది జగపతి బాబు లుక్. జస్ట్ ఆ లుక్ చూపించి యాక్టర్ ఎవరో చెప్పమంటే.. చెప్పడం కష్టం. ఇప్పటివరకు ‘పెద్ది’ నుండి వచ్చిన పోస్టర్స్ లో ప్రత్యేకతను సంతరించుకుంది జగపతి బాబు పాత్ర. సినిమాలో కూడా అతని పాత్ర ఈ రేంజ్లో ఉంటుందేమో చూడాలి.
