జై లవకుశ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యేనా ?
- August 11, 2017 / 05:41 AM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ సినిమాపై భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ పక్కన ఢిల్లీ భామ రాశీ ఖన్నా, నివేత థామస్, నందితరాజ్ నటిస్తున్నారు. హ్యాట్రిక్ తరవాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాని బాబీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలోని మూడు పాత్రల్లో రెండింటిని రిలీజ్ చేశారు. జై మాస్ లుక్ లో అదరగొడితే లవకుమార్ క్లాస్ లుక్ లో ఆకట్టుకున్నారు. మూడో క్యారక్టర్ లుక్ చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం పూణేలోని ప్యాలెస్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని సెప్టెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఆ డేట్ లో సినిమా రిలీజ్ కాకపోవచ్చని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. కారణం అన్వేషిస్తే అసలు విషయం బయటపడింది. షూటింగ్ అనుకున్నట్టుగానే వేగంగా సాగుతోంది. అయితే కుశ క్యారక్టర్ కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా అవసరం అవుతుందంట. అతని షూటింగ్ పార్ట్ ని తొందరగానే కంప్లీట్ అయినప్పటికీ మెరుగులు దిద్దడానికి కొంత ఎక్కువ సమయం పట్టేట్టు ఉందని గ్రాఫిక్స్ టెక్నీషియన్స్ చెబుతున్నారు. మరి ఆ వర్క్ ని ఇతర సంస్థలకు షేర్ చేసి అనుకున్న టైం కి రిలీజ్ చేస్తారా? లేకుంటే పోస్ట్ పోన్ చేస్తారా? అనేది నిర్మాత కళ్యాణ్ రామ్ చేతుల్లోనే ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















