సంచలనం సృష్టించిన జై లవకుశ ట్రైలర్!

రెండు నిముషాల్లో మూడు పాత్రలతో నవరసాలు పలికించారు ఎన్టీఆర్. జై లవకుశ ట్రైలర్ లో తారక్ నటనకు అభిమానులు జై పలుకుతున్నారు. భయపడుతూ.. భయ పెట్టిస్తూ అదరగొట్టేసారు. అందుకే ఈ ట్రైలర్ రికార్డ్ సృష్టించింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన జై లవకుశ ట్రైలర్  ఆదివారం విడుదలై అత్యధిక వ్యూస్ రాబట్టింది. ఈ వీడియో విడుదలైన 24 గంటల్లో 7.54 మిలియన్ల డిజిటల్‌ వ్యూస్‌ను సాధించి ఆశ్చర్య పరచగా కొన్ని క్షణాల క్రితం కోటి వ్యూస్‌ మార్క్ ని దాటేసింది. అతితక్కువ సమయంలో కోటి వ్యూస్‌ను ‘జైలవకుశ’ ట్రైలర్‌ సొంతం చేసుకుందని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ ప్రకటించింది.

‘బాహుబలి’ తర్వాత వేగంగా ఇన్ని వ్యూస్‌ వచ్చిన ట్రైలర్‌ తమ హీరోది అభిమానులు ఆనందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ట్విట్టర్ వేదికపై కృతజ్ఞతలు తెలిపారు.  ”జై లవకుశ’ ట్రైలర్‌కు వచ్చిన స్పందన చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరికీ ధన్యవాదాలు. గతంలో చెప్పినట్లుగానే.. నా నటనతో మీ అందరూ తృప్తి చెందే విధంగా కష్టపడతా’ అని ట్వీట్ చేశారు. రాశీఖన్నా, నివేదా థామస్‌, నందితరాజ్, హంసానందిని, తమన్నాలు అందాలు ఆరబోయనున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 21న విడుదల కాబోతోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus