నవంబర్ 22 నుండి “జై సింహా” కొత్త షెడ్యూల్ ప్రారంభం!

బాలకృష్ణ-నయనతారల క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన “శ్రీరామరాజ్యం, సింహా” చిత్రాలు ఘన విజయం సొంతం చేసుకోవడమే కాక వారి కాంబినేషన్ సదరు సినిమాల సక్సెస్ లో కీలకపాత్ర పోషించింది. “సింహా” తర్వాత మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత “జై సింహా” చిత్రంలో బాలయ్యతో నయనతార జతకట్టడం విశేషం. నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ “జై సింహా”. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్దమవుతుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. “నవంబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు హైద్రాబాద్ లో జరిగే కొత్త షెడ్యూల్ లో పాటలు మినహా టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఇప్పటివరకూ బాలయ్య కెరీర్ లో “సింహా” అనే టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినట్లుగానే.. “జై సింహా” కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం. బాలకృష్ణ-నయనతారల కాంబినేషన్ ఎప్పుడూ కనులవిందుగా ఉంటుంది. “జై సింహా”లో వారి కాంబినేషన్ ఆసక్తికరంగా ఉండబోతోంది.” అన్నారు. బాలకృష్ణ, నయనతార, న‌టాషా దోషీ, హరిప్రియ, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అంబరివ్-రామ్ లక్ష్మణ్-వెంకట్, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus