Jailer2: ‘జైలర్ 2’ ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రూపొందిన ‘జైలర్’ సినిమా ఆగస్టు 10న రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.600 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఈ సినిమాకి ముందు రజినీకాంత్ నటించిన సినిమాలు పెద్దగా మెప్పించలేదు. ఆయన కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీకాంత్ తన ఏజ్ కి , ఇమేజ్ కి తగ్గ పాత్ర చేసి మెప్పించారు అని చెప్పొచ్చు.

అయితే ఈ సినిమా టైటిల్ కి ‘జైలర్’ కి జస్టిఫికేషన్ ఇవ్వలేదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కేవలం 5 నిమిషాల్లోనే లేపేశారు. అలాగే మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లతో రజినీకాంత్ కి ఎలా పరిచయమైంది.. వారి మధ్య స్నేహం ఎలా ఏర్పడింది.. అనేది కూడా చూపించలేదు. ఇవన్నీ ‘జైలర్’ సెకండ్ పార్ట్ లో చూపిస్తారు అనే అభిప్రాయానికి అందరూ వచ్చేసారు. అది నిజమే అని కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ నుండి టాక్ నడుస్తుంది.

‘జైలర్ 2 ‘ లో (Jailer2) రజినీకాంత్ జైల్లో ఏం చేశారు? అక్కడికి శివరాజ్ కుమార్, మోహన్ లాల్..లు ఏ నేరం చేసి వచ్చారు? వంటి విషయాలు చూపించబోతున్నారట. అంతేకాదు ఈ సీక్వెల్ లో కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ కూడా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. 2024 ఫస్టాఫ్ లోనే ‘జైలర్’ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని కూడా స్పష్టమవుతుంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus