Allu Arjun: ఆ తమిళ దర్శకుడు వచ్చింది బన్నీ కోసమేనా?

పుష్ప 2 (Pushpa 2: The Rule)  విడుదల తరువాత ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో గాని అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ మాత్రం సాలీడ్ గా ఉందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. నార్త్ లో ఒకే ఒక్క ఈవెంట్ తో అక్కడ బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇక చెన్నై లోజరిగిన మరో ఈవెంట్ కు సైతం అదే రేంజ్ లో రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ ఈవెంట్ కు తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్  (Nelson Dilip Kumar)  రావడం విశేషం.

Allu Arjun

జైలర్ (Jailer)  సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న నెల్సన్ కు ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం అతను జైలర్ 2 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నెల్సన్ లైన్ లో అల్లు అర్జున్ కూడా ఉన్నట్లు గతంలో టాక్ వచ్చింది. మైత్రి వారే ఈ కాంబినేషన్ ను సెట్స్ పైకి తీసుకు రావడానికి ప్రయత్నం చేసినట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే ఎవరు కూడా అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇవ్వలేదు.

ఇక హఠాత్తుగా నెల్సన్ పుష్ప 2 ఈవెంట్ లో కనిపించడం తో రూమర్స్ నిజమే అన్నట్లు మరో టాక్ మొదలైంది. నెల్సన్ కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సిద్ధమే అన్నట్లు తన స్పీచ్ ద్వారా చెప్పకనే చెప్పారు. ఇక ఆయన డైరెక్ట్ తమిళ్ సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఆయన ప్రతీ భాషలో సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను. సుకుమార్ (Sukumar) ఈ సినిమా కోసం మూడేళ్ళు కష్టపడ్డారు.

పుష్ప 1 (Pushpa)  నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక సీక్వెల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు నిర్మాత రవి గారిని అడిగి తెలుకునేవాన్ని. ఈ సినిమా మంచి అవుట్ పుట్ తో వస్తోంది అని ఒక్క నమ్మకం ఏర్పడింది. తప్పకుండా ఈ సినిమా అందరికి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు నెల్సన్ వివరణ ఇచ్చారు.

ఇక నెల్సన్ అయితే రజినీకాంత్ తో (Rajinikanth)  జైలర్ 2 అనంతరం మళ్ళీ పెద్ద హీరోలతోనే వర్క్ చేయాలని చూస్తున్నాడు. ఇక మరోవైపు బన్నీ పుష్ప 2 రిలీజ్ అనంతరం త్రివిక్రమ్ (Trivikram) కథపై ఫోకస్ పెట్టనున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సినిమా కూడా లైనప్ లో ఉంది. మరి నెల్సన్ బన్నీ కాంబో ఎప్పుడు సెట్టవుతుందో చూడాలి.

‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం ‘రంగస్థలం’ రిపీట్‌ చేస్తున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus