Jailer OTT: రజనీకాంత్‌ ‘జైలర్‌’ ఓటీటీలో చూడాలంటే ఆ పండగ వరకు ఆగాల్సిందేనా?

ఒకప్పుడు సినిమా రిలీజ్‌ అయ్యి… కొన్ని రోజుల తర్వాత ఓటీటీ పార్ట్‌నర్‌ ఎవరు అనేది తెలిసేది. సినిమా అమ్మేశారు, ఇదిగో రిలీజ్‌ డేట్‌ అంటూ వార్తలు వచ్చేవి. లేదంటే ముందే అమ్మేసినా రిలీజ్‌ తర్వాతనే ఆ ముచ్చట్లు వినిపించేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమా సెట్స్‌ మీద ఉండగానే ఇప్పుడు డీల్స్‌ అయిపోతున్నాయి. కొన్ని సినిమాలకు అయితే ఓటీటీలు పెట్టుబడులు కూడా పెడుతున్నాయి. దీంతో ఏ ఓటీటీ అనేది త్వరగా తెలిసిపోతోంది. అలా రీసెంట్‌ రిలీజ్‌ ‘జైలర్‌’ సంగతి కూడా తెలిసిపోయింది.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘జైలర్‌’ సినిమా నిర్మాతల సొంత ఓటీటీలోనే స్ట్రీమ్‌ అవుతుంది అంటున్నారు. అంటే సన్‌ నెక్స్ట్‌లో ‘జైలర్‌’ సినిమా స్ట్రీమ్‌ అవుతుంది అంటున్నారు. రజనీకాంత్ – నెల్సన్ దిలీప్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా, జాకీ ష్రాఫ్‌, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌ తదితరులు నటించారు. టైగర్ ముత్తువేల్ పాండియన్ అనే రిటైర్డ్ జైలర్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. తప్పిపోయిన తన కొడుకు అర్జున్ కోసం వెతికే క్రమంలో ఏం జరిగింది అనేదే కథ.

నేర‌స్తుల‌ ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌నే పేరున్న అర్జున్ ప‌నితీరుని చూసి త‌నలాగే త‌న కొడుకు నీతి నిజాయ‌తీల‌తో ప‌నిచేస్తున్నాడ‌ని గ‌ర్వ‌ప‌డుతుంటాడు ముత్తువేల్‌. ఇంత‌లోనే విగ్ర‌హాల దొంగ‌త‌నం ముఠా నాయ‌కుడైన వ‌ర్మ పని వల్ల ముత్తువేల్‌ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. అంత‌టితో ఆగ‌కుండా ముత్తువేలు కుటుంబాన్ని కూడా అంతం చేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌తాడు వ‌ర్మ‌. దీంతో ముత్తు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు? ఏం చేశాడనేదే కథ.

ఆ విషయం పక్కనపెడితే ఈ సినిమాను ఓటీటీలోకి ఫెస్టివల్‌ సమయంలో తీసుకొస్తారు అని అంటున్నారు. తమిళ జనాలకు దీపావళి చాలా స్పెషల్‌. ఈ సినిమాను కూడా అదే సమయంలో తీసుకొస్తారు అని చెబుతున్నారు. అయితే దీనికి చాలా సమయం ఉంది కాబట్టి విజయదశమికి అయినా వచ్చేయొచ్చు అని అంటున్నారు. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus