రజినీకాంత్ తమిళంలో నెంబర్ 1 హీరోగా ఓ వెలుగు వెలిగారు. 70 ఏళ్ళ వయసు మీద పడినా సినిమాలు చేస్తున్నారు. తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సొంతం. కానీ కొంతకాలంగా ఆయన ఇమేజ్ కి తగ్గ సినిమా పడట్లేదు అనే కంప్లైంట్ ఉంది. కమల్ హాసన్ కూడా విక్రమ్ అనే సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసే హిట్ అందుకున్నాడు. కానీ రజినీకాంత్ కి ఇంకా అలాంటి పడట్లేదు. మరోపక్క విజయ్ కూడా దూసుకుపోతున్నాడు. అన్నీ ఎలా ఉన్నా.. తెలుగులో ఒకప్పుడు రజినీకాంత్ కి ఓ రేంజ్ మార్కెట్ ఉండేది.
‘కబాలి’ సినిమాని తెలుగులో రూ.28 కోట్ల రేటుకి బయ్యర్స్ కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు రజినీకాంత్ సినిమాలకి ఉన్న తెలుగు మార్కెట్ గురించి తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ‘పేట’ ‘దర్బార్’ ‘పెద్దన్న’ వంటి సినిమాలు ఇక్కడ ఘోరంగా ప్లాప్ అయ్యాయి. వాటి ఎఫెక్ట్ ఇప్పుడు ‘జైలర్’ పై పడింది. నెల్సన్ డైరెక్షన్లో రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ సినిమా ఆగస్టు 10 న విడుదల కాబోతోంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ వీడియో, ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వగా వాటికి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ఈ చిత్రానికి బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు అని వినికిడి. అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ‘జైలర్’ కి రూ.9 కోట్లకి మించి బిజినెస్ జరగడం లేదట. పైగా ‘జైలర్’ రిలీజ్ అయిన తర్వాతి రోజు అంటే ఆగస్టు 11 న చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ మూవీ రిలీజ్ అవుతుంది.
ఆ సినిమా (Jailer) పై కూడా పెద్దగా అంచనాలు లేకపోయినా.. మొదటి రోజు అయితే భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. అందుకే రజినీ సినిమాకి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదు. ‘జైలర్’ కనుక హిట్ అయితే పరిస్థితి మారే అవకాశాలు ఉన్నాయి. మరేమవుతుందో చూడాలి.
‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!
ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!