దళపతి విజయ్ హీరోగా రూపొందిన ‘జన నాయకుడు'(Jana Nayagan) సినిమా 2026 సంక్రాంతి బరిలో నిలవనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ‘ది రాజసాబ్’, చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’..వంటి స్ట్రైట్ తెలుగు సినిమాలు ఉన్నప్పటికీ విజయ్ ‘జన నాయగన్’ ని తెలుగులో పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
తెలుగులో ఈ సినిమాని ‘జన నాయకుడు’ పేరుతో రిలీజ్ చేయనున్నారు. అలా అని ఇదేదో కొత్త కథతో రూపొందుతున్న సినిమా కాదు. ఆల్రెడీ తెలుగులో బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ సినిమాకి రీమేక్ గా రూపొందింది. తెలుగు రీమేక్ అయినప్పటికీ తెలుగులో.. అదీ సంక్రాంతి వంటి బిజీ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

పీవీపీ సంస్థ ఈ చిత్రం తెలుగు హక్కులను కొనుగోలు చేసి దిల్ రాజు ద్వారా నైజాంలో రిలీజ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. ‘జన నాయగన్’ చిత్రం జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టు మొదట ప్రకటించారు. కానీ తర్వాత ప్రభాస్ ‘ది రాజాసాబ్’ వంటి పెద్ద సినిమా ఉంది కాబట్టి.. ఒక్కరోజు వెనక్కి అంటే జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తుంది.
‘జన నాయకుడు’ తెలుగు వెర్షన్ ని జనవరి 14 కి వాయిదా వేసినట్టు టాక్ వినిపిస్తుంది. థియేటర్స్ ఇష్యూ రాకుండా దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇన్సైడ్ టాక్. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
