సుహాస్ (Suhas), విపిన్ సంగీర్తన (Sangeerthana Vipin) హీరో హీరోయిన్లుగా సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదలైంది. (Dil Raju) ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై హన్షిత రెడ్డి (Hanshitha Reddy). , హర్షిత్ రెడ్డి(Harshith Reddy)..లు నిర్మించిన ఈ చిత్రం రెండో వీకెండ్ కూడా పర్వాలేదు అనిపించింది. కం*మ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ రాబట్టుకున్న సంగతి తెలిసిందే.
ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.95 cr |
సీడెడ్ | 0.24 cr |
ఆంధ్ర(టోటల్) | 0.89 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.08 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.19 cr |
ఓవర్సీస్ | 0.32 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 2.59 cr |
‘జనక అయితే గనక’ చిత్రానికి రూ.3.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజుల్లో ఈ సినిమా రూ.2.59 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.41 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ కి పర్వాలేదు అనిపించినా.. టార్గెట్ ఇంకా చాలా ఉంది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ ఇక కష్టమే అనిపిస్తుంది.