జనతా గ్యారేజ్ కాంబో లో మళ్లీ మూవీ
- May 20, 2017 / 06:06 AM ISTByFilmy Focus
ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఓ లెక్కన తారక్ కి పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది. 130 కోట్లు సాధించి నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. అంతటి మంచి సినిమా ఇచ్చిన కొరటాల తో ఎన్టీఆర్ మళ్ళీ కలుస్తున్నారు. వారి కాంబినేషన్లో సినిమా రానుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ 28 వ సినిమా నిర్మించనున్నారు.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తారక్ జై లవకుశ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ నిన్న రిలీజ్ అయి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. డబుల్ ధమాకా మాదిరి రెండు పోస్టర్లు ఫ్యాన్స్ కి ఉత్సాహాన్నిచ్చింది. ఈ మూవీని వేగంగా పూర్తి చేసి సెప్టెంబర్ 1 న రిలీజ్ చేయనున్నారు. అనంతరం కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. కొరటాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్.. తన అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














