Mohanlal: ఏమీ లేదు అనుకున్న టైమ్లో ఎన్టీఆర్ సినిమా ఆదుకుంది

ఈ క్రిస్మస్ పండగను క్యాష్ చేసుకోవాలని చాలా సినిమాలు సందడి చేయబోతున్నాయి. అందులో ఎక్కువగా మలయాళ, కన్నడ సినిమాలే ఉండడం గమనార్హం. తెలుగు సినిమాలు ఒకటి అరా మినహా మరే ఇతర సినిమాలు లేకపోవడం కొసమెరుపు. నితిన్(Nithiin) ‘రాబిన్ హుడ్’ (Robinhood)  అయితే మొదట ఈ క్రిస్మస్ కి ప్రకటించినప్పటికీ తరువాత ఎందుకనో తరువాత తప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఈ డిసెంబర్ మూడో వారంలోనే తాడోపేడో తేల్చుకోబోతున్నాయి కొన్ని సినిమాలు. వీటిలో అల్లరి నరేష్  (Allari Naresh)  బచ్చల మల్లి(Bachhala Malli)  ఒక్కటే టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ కావడం గమనార్హం.

Mohanlal

మిగిలినవన్నీ డబ్బింగ్ సినిమాలే కావడం విశేషం. ఇందులో మోహన్ లాల్ (Mohanlal) కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ ఒకటుంది. దాని పేరు బరోజ్. దీనికి మోహన్ లాల్ స్వయంగా దర్శకత్వం వహించి నటించడంతో ఈ సినిమాపైన మలయాళంలో చాలా అంచనాలు ఉన్నాయి. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. అసలు విషయంలోకి వెళితే… ఇక్కడ ఈ సినిమాకి సరైన డిస్ట్రిబ్యూషన్ అవసరమైన నేపథ్యంలో మోహన్ లాల్ కు అండగా మైత్రి మూవీ మేకర్స్ నిలుస్తున్నారు.

దీనికి కారణం ఒకటే… అదే జనతా గ్యారేజ్. ఈ బ్యానర్లో వచ్చిన జనతా గ్యారేజ్ (Janatha Garage) ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కాగా ఇందులో మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్ర పోషించి విజయంలో భాగస్వామ్యం అయ్యారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే బరోజ్ బాధ్యతలను మైత్రి తీసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే సమయంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర (Upendra) యుఐ  (UI The Movie) సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. దాని కోసం ఉపేంద్ర హైదరాబాద్ వచ్చి మరీ ప్రమోషన్స్ షురూ చేసాడు.

ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇక తన విడుదల పార్ట్ 2 (Vidudala Part 2)  సినిమా కోసం విజయ్ సేతుపతి(Vijay Sethupathi) భాగ్యనగరంలోనే ప్రస్తుతం నివసిస్తున్నాడు. మరోవైపు మ్యాక్స్ కోసం సుదీప్ కూడా సిద్ధపడుతున్నాడు. మరి ఇన్ని సినిమాల మధ్య మోహన్ లాల్ బరోజ్ 3డి సినిమా ఎటువంటి ప్రభంజనాలు సృష్టింస్తుందో చూడాలి మరి. డిసెంబర్ 25న రానున్న ఈ సినిమా కోసం మలయాళీలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

 మళ్లీ నిరాశే… ఆస్కార్‌లో షార్ట్ లిస్ట్‌లో నో ‘లాపతా లేడీస్‌’!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus