Janhvi Kapoor: ఎన్టీఆర్30 మూవీతో జాన్వీ ఆ స్టేటస్ ను అందుకుంటారా?

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఈ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక కాగా ఈ సినిమాతో కచ్చితంగా స్టార్ స్టేటస్ సొంతమవుతుందని ఆమె భావిస్తున్నారు. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించినా ఆ సినిమాలు జాన్వీ కపూర్ కోరుకున్న విజయాన్ని అందించలేదు. జాన్వీ కపూర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య తక్కువ కాదనే సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా (Janhvi Kapoor) జాన్వీ కపూర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం సోషల్ మీడియలో హాట్ టాపిక్ అవుతోంది. ఎన్టీఆర్30 సినిమాకు త్వరలో టైటిల్ ను ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు 300 కోట్ల రూపాయల స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్ కు జాన్వీ కపూర్ చేరుకోగా ఆమె ఈ సినిమా షూట్ లో పాల్గొననున్నారు. ఎన్టీఆర్, జాన్వీ కాంబో సీన్లు బాగుంటాయని తెలుస్తోంది.

ఈ సినిమా రిలీజ్ కు ఏడాది సమయం ఉన్నా ఈ సినిమా హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఎన్టీఆర్30 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం. ఎన్టీఆర్30 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులు ఫిదా అయ్యేలా ఉంటాయని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్30 సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్, జాన్వీ జోడీ బాగుంటుందని ఈ జోడీ ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబో సినిమా హిట్ అయితే ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో సరికొత్త రోల్ లో కనిపించనున్నారు. ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus