Janhvi Kapoor: ఎన్టీఆర్ సినిమా కోసం హైదరాబాదులో ఫ్లాట్ కొన్న జాన్వీ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా కోసం అత్యంత భారీ బడ్జెట్ కేటాయించడమే కాకుండా ప్రతి ఒక్క విషయంలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్టీఆర్ కొరటాల ఇద్దరు కూడా ఈ సినిమాపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేశారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసి కొరటాల శివతో పాటు ఎన్టీఆర్ లో కూడా స్పష్టంగా కనపడుతుంది.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇందులో హీరోయిన్ గా నటి జాన్వీ కపూర్ నటిస్తున్నారు.అలాగే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం జాన్వీ తరచూ ముంబై నుంచి హైదరాబాద్ వెళ్లి రావాలి అంటే ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈమె ఏకంగా ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదులో ఉండటానికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.

జర్నీ చేయడం వల్ల తాను షూటింగ్ పై ఫోకస్ చేయలేకపోతున్నానని అందుకే ఇక్కడే ఉంటే ప్రశాంతంగా సినిమా షూటింగ్లో పాల్గొనవచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇలా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి పోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి జాన్వీ కపూర్  (Janhvi Kapoor) ఇలాంటి నిర్ణయం తీసుకుని

ఏకంగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాత్రికి రాత్రి హైదరాబాదులో తనకు నచ్చినటువంటి ఒక ప్లాట్ కొనుగోలు చేశారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఏ హీరోయిన్ కూడా సినిమా షూటింగుల కోసం ఇలా చేయలేదు కానీ ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వి తీసుకున్న నిర్ణయం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus