Janhvi Kapoor: చిన్న వయస్సులోనే ఆ ఫోటోల వల్ల ఇబ్బంది.. జాన్వీ ఏమన్నారంటే?

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు కాగా జాన్వీ కపూర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం దేవర సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు.
ఫోటోగ్రాఫర్లు, కెమెరాలు నా లైఫ్ లో భాగమేనని ఆమె తెలిపారు.

నాకు పదేళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి ఆన్ లైన్ లో నా ఫోటోలు కనిపించేవని జాన్వీ కపూర్ కామెంట్లు చేశారు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడతానంటూ నా ఫోటోలను ప్రచురించారని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు. నేను పాఠశాలలో చదివే సమయంలో నా స్కూల్ లో ఉన్నవాళ్లంతా ఆ ఫోటోలను చూశారని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. నా ఫోటోలను చూసిన నా స్నేహితులు నన్ను దూరం పెట్టడంతో పాటు నాపై జోక్స్ వేశారని ఆమె తెలిపారు.

సినిమా ఇండస్ట్రీలో నేను కష్టపడాల్సిన అవసరం లేదని నా ఫ్రెండ్స్ నాపై కామెంట్లు చేశారని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. స్కూల్ ఎప్పుడు మానేస్తున్నానని నా స్నేహితులు ప్రశ్నించేవారని ఆమె కామెంట్లు చేశారు. వాళ్లు నన్ను జడ్జ్ చేయడానికి అలా ప్రవర్తించడానికి కారణాలు అర్థమయ్యేవి కావని ఆమె చెప్పుకొచ్చారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో మార్ఫింగ్ ఫోటోలు, ఫేక్ ఫోటోలు ఎక్కువవుతున్నాయని జాన్వీ కపూర్ వెల్లడించారు.

మార్ఫింగ్ ఫోటోలను చూసి ఆ ఫోటోలు నిజమేనని చాలామంది భ్రమ పడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఆ విషయం నన్నెంతో బాధ పెడుతోందని జాన్వీ కపూర్ అన్నారు. టీనేజ్ లో ఉన్న సమయంలో నా ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వెబ్ సైట్లలో ఉపయోగించారని అమె కామెంట్లు చేశారు. ఈ విషయం తెలిసి కంగారు పడ్డానని (Janhvi Kapoor) జాన్వీ కపూర్ అన్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus