Janhvi Kapoor: కరణ్ షోలో నోరు జారిన జాన్వీ కపూర్.. క్లారిటీ ఇచ్చేసిందిగా!

దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేవర సినిమాలో జాన్వీ కపూర్ తంగం అనే పాత్రలో నటిస్తున్నారు. కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో జాన్వీ కపూర్ తన చెల్లి ఖుషి కపూర్ తో కలిసి పాల్గొనగా ఈ షోలో జాన్వీ కపూర్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. దేవర సినిమా సక్సెస్ సాధిస్తే జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత బిజీ అయ్యే అవకాశం ఉంటుంది.

ధడక్ సినిమాతో జాన్వీ కపూర్ కెరీర్ మొదలు కాగా ఆమె నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. దేవర మూవీ గ్లింప్స్ ఈ నెల 8వ తేదీన రిలీజ్ కానుండగా ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాకు జాన్వీ 4 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది.

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటుడి శిఖర్ పహారియాతో డేటింగ్ లో ఉందని గత కొంతకాలంగా వార్తలు ప్రచారంలోకి వస్తుండగా కాఫీ విత్ కరణ్ షోలో జాన్వీకి నీ స్పీడ్ డయల్ నంబర్స్ లో ముగ్గురి పేర్లు చెప్పమనే ప్రశ్న ఎదురు కాగా నాన్న, ఖుషి, శిక్కు అని జాన్వీ చెప్పారు. జాన్వీ శిఖర్ పేరు చెప్పడంతో జాన్వీ, శిఖర్ డేటింగ్ లో ఉన్నారని క్లారిటీ వచ్చేసిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

జాన్వీ కపూర్ రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించిన తీపికబురును చెప్తారేమో చూడాల్సి ఉంది. జాన్వీ కపూర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇస్తే ఆమె కెరీర్ వేగంగా పుంజుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కపూర్ సౌత్ లోని ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడితే ఆమె కెరీర్ కు మరింత బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. జాన్వీ కపూర్ త్వరలో మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus