NTR30: అఫీషియల్ : ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్

‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ అయ్యి ఏడాది కావస్తున్నా ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఉంటుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కొరటాల శివకు అత్యంత సన్నిహితులు అయిన మిక్కిలినేని సుధాకర్ ‘యువసుధా ఆర్ట్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ కూడా సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. కానీ ఎందుకో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు.

ఫిబ్రవరి 23,24 తేదీల్లో మొదలు కావాల్సి ఉంది. అయితే తారకరత్న ఫిబ్రవరి 18న మరణించడంతో.. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అయితే ఎన్టీఆర్ 30 నుండి అదిరిపోయే అప్డేట్ ఇస్తున్నట్టు రెండు రోజుల క్రితం మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపికైనట్టు అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 2వ వారంలో జాన్వీ కపూర్ హైదరాబాద్.. కు వచ్చింది.

అప్పుడు ఆమె పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ ను నిర్వహించారు మేకర్స్ . ఈరోజు జాన్వీ కపూర్ పుట్టినరోజు కావడంతో ఆమె లుక్ కు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఇందులో జాన్వీ చాలా అందంగా కనిపిస్తుంది. ‘ఎన్టీఆర్ 30’ ని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేశారు కాబట్టి.. హిందీ మార్కెట్ కోసం జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు అని స్పష్టమవుతుంది. అలాగే ఇది ఆమెకు తెలుగులో డెబ్యూ మూవీ అన్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం కనుక సక్సెస్ అయితే జాన్వీ.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో విలన్ గా కూడా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఎంపికైనట్టు టాక్ వినిపిస్తుంది. సైఫ్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’ లో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ 30 లో అతను విలన్ గా నటిస్తుంది లేనిది క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus