Janhvi Kapoor: మొదటి తెలుగు సినిమాకే భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జాన్వీ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR విడుదలయ్యి ఏడాది కావస్తోంది. ఇప్పటికి ఈయన ఇంకో సినిమా షూటింగ్ పనులలో ఏమాత్రం పాల్గొనలేదు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నారని వార్తలు వచ్చాయి అయితే కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమా ఇంకా షూటింగ్ పనులను జరుపుకోలేదు. ఇలా ప్రతిసారి ఏదో ఒక కారణం చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అంటూ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ఈ సినిమా హీరోయిన్ విషయంలో గందరగోళం ఏర్పడింది.అయితే తాజాగా ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నారు దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. ఇక ఈ విషయాన్ని మేకర్స్ అధికారక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ జాన్వీ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇలా ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేస్తారని సమాచారం. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం జాన్వీ కపూర్ తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం ఈమె భారీగానే డిమాండ్ చేశారని తెలుస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకి 3 నుంచి 3.5కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే వారట. అయితే ఈమె సౌత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతో ఓకే సారి తన రెమ్యూనరేషన్ కోటి రూపాయలకు పైగా పెంచేసి ఏకంగా ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇలా మొదటి తెలుగు సినిమాకే ఈమె ఏకంగా కోటి రూపాయలు పెంచేసి రెమ్యూనరేషన్ తీసుకోవడంతో ఈ విషయం కాస్త బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus