Janhvi Kapoor, Jr NTR: ఎన్టీఆర్ వల్లే జాన్వీ కపూర్ ఏడ్చిందా..!

శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్… దఢక్ సినిమాతో తెరంగేట్రం చేసి.. సూపర్ హిట్ అందుకుంది. కమర్షియల్ సినిమాలకు దూరంగా .. డిఫరెంట్ కథలను సెలక్ట్ చేసుకుంటూ.. హీరోయిన్ గా సెట్ అయ్యింది జాన్వీ కపూర్. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ డమ్ అందుకుంది. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.

ఇప్పుడు తెలుగు లో పక్కా కమర్షియల్ సినిమాతో పరిచయం కాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది జాన్వీ. సౌత్ ఇండస్ట్రీలో ఆమె నటిస్తోన్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మత్స్యకారుల కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించనుంది. అలాగే ఇందులో జాన్వీ పాత్రకు యాక్షన్ సీన్స్ ఉంటాయని టాక్ వినిపిస్తుంది. అయితే ఈమెకి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం, అభిమానం.

ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఈ విషయాన్నీ స్వయంగా జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అయితే రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఫిలిం నగర్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అదేమిటి అంటే జాన్వీ కపూర్ కి దేవర సెట్స్ ని వదిలి వెళ్లాలని అనిపించట్లేదట. షూటింగ్ పూర్తి అవ్వగానే అప్పుడే వెళ్లిపోవాలా?, ఇంకా షూటింగ్ కాసేపు ఉంటే బాగుంటుంది అని అనేది అట. అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఆమె చాలా మంచి స్నేహాన్ని ఏర్పాటు చేసుకుందట.

షూటింగ్ సమయం లో (Jr NTR) ఎన్టీఆర్ తన తోటి నటీనటులతో ఎంత సరదాగా ఉంటాడో మన అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ లోని ఈ లక్షణం జాన్వీ కి బాగా నచ్చిందట. రీసెంట్ గానే ఆమె మీద పలు సన్నివేశాలను చిత్రీకరించారట. ఈ సన్నివేశాలు తీస్తున్నప్పుడు ఎన్టీఆర్ లేదట. ఎన్టీఆర్ లేకపోయేసరికి జాన్వీ కపూర్ చాలా లోన్లీ గా ఫీల్ అయ్యిందట. ఆరోజు మొత్తం డల్ గానే కూర్చొని, ప్యాకప్ చెప్పగానే నిరాశతో ముంబై కి తిరిగి వెళ్లిందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus