Janhvi Kapoor: ఫ్యాషన్‌ సెన్స్‌పై జాన్వీ కపూర్‌ ఆసక్తికర కామెంట్స్‌.. ఏం చెప్పిందంటే?

ఇండియన్‌ సినిమా పరిశ్రమలో ఫ్యాషన్‌ సెన్స్‌ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఒకప్పుడు మంచి డ్రెస్‌, అదిరిపోయే ఆర్నమెంట్స్‌ పెట్టుకుంటే ఫ్యాషన్‌ సెన్స్‌ అనుకునేవారు. అయితే ఇప్పుడు దానికి కాస్త మోడర్న్‌ టచ్‌ ఇస్తున్నారు. డ్రెస్‌ డిజైన్‌, స్పెషల్‌ అరేంజ్మెంట్స్‌తో నేటి తారలు అదరగొట్టేస్తున్నారు. ఇలాంటి భామల జాబితాలో తొలి స్థానంలో నిలిచే కథానాయిక జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) . వరుస సినిమాలు చేస్తూనే.. ఫొటో షూట్లూ చేస్తుంటుంది. జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తే ఆమె ఫొటో షూట్ల సందడి ఏంటో మీకే తెలుస్తుంది.

ఈ క్రమంలో ఆమె తాజాగా ధరించిన కొన్ని డ్రెస్‌లు.. ఫాలో అయిన ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ విషయంలో చిన్నపాటి ట్రోల్‌ జరుగుతోంది. వేరే నాయికలు, సెలబ్రిటీలను జాన్వీ కాపీ కొడుతోంది అంటూ విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ కామెంట్లకు జాన్వీ కౌంటర్‌ ఇచ్చింది. ట్రోలింగ్ అక్కర్లేదు అంటూ అసలు విషయం చెప్పేసింది. కొత్త సినిమా ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ (Mr. & Mrs. Mahi) సినియమా ప్రచారంలో ఫుల్‌ జిజీగా ఉంది జాన్వీ కపూర్‌. ప్రెస్‌ మీట్‌లు, ఇంటర్వ్యూల్లో అంటూ బిజీ బిజీగా గడిపేస్తోంది.

ఈ క్రమంలో ఓ నెటిజన్‌ జాన్వీ ఫ్యాషన్‌ గురించి అడిగాడు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్‌ టాపిక్‌. మీరు హాలీవుడ్‌ నటి జెండయా, ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఉర్ఫీ జావేద్‌ ఫ్యాషన్‌ స్టైల్‌ని కాపీ చేశారా? అని అడిగితే.. జాన్వీ ఎంతో క్లియర్‌గా అవును అని చెప్పేసింది. ‘ఛాలెంజర్స్‌’ సినిమా కోసం జెండయా చేసిన ప్రమోషన్స్‌ ఆధారంగానే నేనూ నా సినిమా ప్రచారం చేస్తున్నా. ఉర్ఫీ ఫ్యాషన్‌ క్రియేటివ్‌గా ఉంటుంది.

ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌ను అప్పుడప్పుడు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటా. ఇటీవల జాన్వీ రెడ్‌ కలర్‌ డ్రెస్సు వేసింది. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ డ్రెస్సు గతంలో ఉర్ఫీ ధరించిన ఓ డ్రెస్సును పోలి ఉండటమే దానికి కారణం. కానీ ఉర్ఫీ కంటే జాన్వీకే ఆ డ్రెస్‌ బాగుంది అనేది నెటిజన్ల మాట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus