Janhvi Kapoor: నా ఫ్యామిలీని చూసి అవకాశాలు ఇవ్వరు.. టాలెంట్ మాత్రమే చూస్తారు:జాన్వీ

దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్.ధడక్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఈమె నటించిన ఏ సినిమా కూడా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి. ఇకపోతే త్వరలోనే జాన్వీ కపూర్ నటించిన మిల్లి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జాన్వీ కపూర్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాది సినిమా ఫ్యామిలీ అని సినిమా అవకాశాలు తనకు ఊరికే రావని, ఎవరు కూడా తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చూసి సినిమా అవకాశాలు ఇవ్వరు అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

మొదట రెండు సినిమాలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూసి అవకాశాలు కల్పించినప్పటికీ తదుపరి సినిమాలన్నీ కూడా నా టాలెంట్ చూసి అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. నేను స్టార్ డాటర్ అని నమ్మి నాపై కోట్లు ఖర్చు చేసి నష్టాలు పాలు కావాలని ఏ ప్రొడ్యూసర్ అనుకోరు. మా నాన్న మేము కూడా నష్టాలు రావాలని కోరుకోము.

సినిమాలలో నష్టాలు వస్తే భరించే అంత ధనవంతులం కాదు మేము అంటూ జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా ఇండస్ట్రీలో తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయి అంటే తన టాలెంట్ చూసి మాత్రమే తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని ఈ సందర్భంగా జాన్వీ కపూర్ చేసినటువంటి ఈ కామెంట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus