శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ‘ధఢక్’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. హిందీలో జాన్వీ నటించిన ఏ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. ఇటీవల వచ్చిన ‘పరమ్ సుందరి’ కూడా ప్లాప్ గా మిగిలిపోయింది.
హిందీలో ఆమెకు పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు రావడం లేదు. అది కూడా కరణ్ జోహార్ వంటి బ్యాకప్ ఉన్నప్పటికీ జాన్వీని అక్కడ పెద్ద హీరోలు ఫోకస్ చేయడం లేదు. అందుకు కారణాలు ఏంటి అనేది బాలీవుడ్ మీడియాకి కూడా అర్ధం కావడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ‘దేవర’ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందులో తంగం పాత్రలో జాన్వీ గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ‘చుట్టమల్లే’ సాంగ్ తో ఆమెకి ఇక్కడ మంచి పాపులారిటీ దక్కింది.
ఆమె గ్లామర్ కి అయితే మంచి మార్కులు పడ్డాయి. కానీ నటిగా ఆమె ప్రూవ్ చేసుకున్నది లేదు. ఇప్పుడు ‘దేవర 2’ తో పాటు రాంచరణ్ ‘పెద్ది’, అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాల్లో జాన్వీ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని స్కెచ్ వేసింది. మరోపక్క బాలీవుడ్లో కూడా వరుస సినిమాలు చేస్తుంది. ఆమె లేటెస్ట్ మూవీ ‘సన్నీ సంస్కారి కి తుల్సి కుమారి’ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ పాల్గొన్న గ్లామర్ ఫోటో షూట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :