భర్తతో అరటాకులో భోజనం చేస్తా : జాన్వీ కపూర్

తెలుగు, తమిళం, హిందీ ఇతర భాషల్లో వందల సంఖ్యలో సినిమాల్లో నటించి కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు శ్రీదేవి. 2018 సంవత్సరంలో ఫిబ్రవరి 24వ తేదీన శ్రీదేవి దుబాయ్ లోని హోటల్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా సత్తా చాటుతున్నారు. త్వరలో కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఒక సినిమాతో జాన్వీ తెలుగు తెరకు కూడా పరిచయం కానున్నారని ప్రచారం జరుగుతోంది.

జాన్వీ తండ్రి బోనీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో త్వరలోనే జాన్వీ టాలీవుడ్ కు పరిచయమవుతుందని చెప్పడం గమనార్హం. అయితే జాన్వీ ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉందని.. ఆ పెళ్లిలో సన్నిహితులు మాత్రమే ఉండాలని జాన్వీ తెలిపారు. బంగారం పెట్టుకుని కాంచీవరం చీరలో తలలో పూలు పెట్టుకొని పెళ్లికూతురులా ముస్తాబు అవుతానని ఆమె అన్నారు. పెళ్లికి భర్త లుంగీలో రావాలని.. అరటాకులో భర్తతో కలిసి భోజనం చేయాలని ఉందని ఆమె పేర్కొన్నారు.

తాను చాలాసార్లు తిరుపతికి వెళ్లానని.. లైఫ్ లో ఎంతో ఇంపార్టెంట్ అయిన పెళ్లిని ఇష్టమైన వ్యక్తితో అక్కడే చేసుకోవాలని ఉందని జాన్వీ అన్నారు. ఆడంబరంగా జరిగే పెళ్లి అంటే తనకు నచ్చదని.. గతంలో తిరుపతిలో జరిగిన బంధువుల పెళ్లికి తాను హాజరయ్యానని జాన్వీ తెలిపారు. పెళ్లిలాంటి పెద్ద శుభకార్యంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలని తనకు అనిపిస్తుందని ఆమె అన్నారు. తల్లి అలవాట్లు, అభిరుచులను ఎంతో ఇష్టపడే జాన్వీ పెళ్లి చేసుకునే ప్లేస్ విషయంలో తిరుపతిని ఎంచుకోవడం గమనార్హం. జాన్వీ కపూర్ బంధువులు తిరుపతి పరిసర ప్రాంతాల్లో నివశిస్తున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus