Janhvi Kapoor: ఎన్టీఆర్ రాగానే సెట్ కే కళ వస్తుంది.. జాన్వీ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడాల్లేకుండా వరుస సినిమాలతో జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉలఘ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దేవర (Devara)  సినిమా గురించి జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. తెలుగువారి పనితీరు నాకు చాలా ఇష్టమని జాన్వీ కపూర్ వెల్లడించారు. తెలుగు వాళ్లు కళను, సినిమాను గౌరవిస్తారని ఆమె వెల్లడించారు. తెలుగు వాళ్లు కథపై నమ్మకంతో పని చేస్తారని జాన్వీ కపూర్ అన్నారు.

ప్రస్తుతం దేవరలో చేస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) ఎనర్జిటిక్ హీరో అని జాన్వీ కపూర్ వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ రాగానే సెట్ కే కళ వస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. తాజాగా జరిగిన షెడ్యూల్ లో మా ఇద్దరిపై సాంగ్ షూట్ చేశారని తారక్ డ్యాన్స్ చేసే వేగాన్ని చూసి ఆశ్చర్యపోయానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సెకన్ లో దేన్నైనా నేర్చుకోగలరని జాన్వీ కపూర్ పేర్కొన్నారు.

తారక్ నేర్చుకున్న డ్యాన్స్ ను నేను నేర్చుకోవడానికి 10 రోజుల సమయం తీసుకున్నానని జాన్వీ కపూర్ వెల్లడించారు. ఎన్టీఆర్ తో తర్వాత పాట షూట్ కోసం ఇప్పటినుంచే ప్రాక్టీస్ చేస్తున్నానని జాన్వీ కపూర్ వెల్లడించారు. డైరెక్టర్ కొరటాల శివ  (Koratala Siva)  ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారని ఆమె అన్నారు.

దేవర ప్రాజెక్ట్ కు కొరటాల శివ కెప్టెన్ అని ఏ విషయమైనా కొరటాల శివ సున్నితంగా చెబుతారని కొరటాల శివతో పని చేయడం చాలా సులువు అని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తల్లీదండ్రులు నేర్పారని నేను నా ఫ్యాన్స్ గర్వపడేలా బిహేవ్ చేస్తానని ఆమె అన్నారు. ఈ మధ్య కాలంలో ఆరోగ్య పరంగా కొంచెం ఇబ్బంది పడ్డానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus