Janhvi Kapoor: శుక్రవారం ఆ పనులు అస్సలు చేయను.. జాన్వీ చెప్పిన విషయాలివే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ తెలుగులో దేవర (Devara) సినిమాతో పాటు చరణ్ (Ram Charan)  బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబో సినిమాలో సైతం హీరోయిన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నా ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమలలో సైతం నటిస్తున్నారు. అమ్మ (Sridevi) కొన్ని విషయాలను బాగా నమ్మేవారని ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని పనులు చేయడానికి అమ్మ అంగీకరించేది కాదని జాన్వీ కపూర్ పేర్కొన్నారు.

శుక్రవారం జుట్టు కత్తిరించుకోకూడదని అమ్మ చెప్పేవారని అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని అమ్మ అనేవారని ఆమె అన్నారు. శుక్రవారం రోజున అమ్మ నల్ల దుస్తులను సైతం వేసుకోనిచ్చేవారు కాదని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. అమ్మ బ్రతికి ఉన్న సమయంలో నేను ఇలాంటి వాటిని పట్టించుకోలేదని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. ఆ సమయంలో మూఢ నమ్మకాలు అని కొట్టిపడేసేదానినని జాన్వీ వెల్లడించారు.

అమ్మ మా నుంచి దూరమైన తర్వాత వీటిని నమ్మడం మొదలుపెట్టానని ఆమె పేర్కొన్నారు. అమ్మ కంటే నేనే ఎక్కువగా విశ్వసిస్తున్నానని జాన్వీ కపూర్ వెల్లడించారు. అమ్మ ఎప్పుడూ తిరుమల దేవుడి పేరును తలచుకుంటూ ఉండేదని ఆమె పేర్కొన్నారు. షూటింగ్ గ్యాప్ లో నారాయణ నారాయణ ఆనుకుంటుండేదని జాన్వీ కపూర్ అన్నారు. అమ్మ ప్రతి ఏడాది పుట్టినరోజున స్వామివారిని దర్శించుకునేదని ఆమె చెప్పుకొచ్చారు.

అమ్మ చనిపోయిన తర్వాత తన పుట్టినరోజున నేను తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. అమ్మ లేకుండా తొలిసారి తిరుమల వెళ్లిన సమయంలో ఎంతో ఎమోషనల్ అయ్యానని జాన్వీ చెప్పుకొచ్చారు. తిరుమల వెళ్లిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుందని అందుకే ప్రతిసారి వెళ్తానని జాన్వీ కపూర్ కామెంట్లు చేయడం గమనార్హం. జాన్వీ కపూర్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చనిపోయిన తల్లిపై ఆమె చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus