Janhvi Kapoor: ప్రస్తుతం తాను ఏడవాలనుకోవడం లేదు.. తల్లి బయోపిక్ పై జాన్వీ కపూర్ కామెంట్స్!

శ్రీదేవి వారసురాలిగా దడక్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్. ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె తాజాగా మిల్లి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇష్టమయ్యారు. తన తండ్రి బోనికపూర్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జాన్వీ కపూర్ కి తన తల్లి శ్రీదేవి బయోపిక్ చిత్రం గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. తన తల్లి శ్రీదేవి బయోపిక్ చిత్రం చేస్తే నటిస్తారా అనే ప్రశ్న తనకు ఎదురైంది. ఇలా యాంకర్ ప్రశ్నించగానే వెంటనే జాన్వి కపూర్ నో అనే సమాధానం చెప్పారు. ఇలా నో చెప్పడానికి గల కారణం ఏంటి అని యాంకర్ ప్రశ్నించడంతో నా దగ్గర పెద్ద సమాధానం ఉంది

అయితే ఇప్పుడు ఆ సమాధానం చెప్పి ఈ వేదికపై తాను ఏడవాలనుకోవడం లేదు అంటూ ఈ సందర్భంగా జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి బయోపిక్ చిత్రం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆ నొప్పులను భరించలేక

మూడు రోజులపాటు పెయిన్ కిల్లర్స్ కూడా ఉపయోగించానని ఈ సందర్భంగా జాన్వీ కపూర్ వెల్లడించారు.నవంబర్ 4వ తేదీ రాబోతున్న ఈ సినిమాపై ఈమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా జాన్వీ కపూర్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus