Janhvi Kapoor: ఆ ఫోటోలు చూసి షాకైనా స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్!

ప్రెజెంట్ జెనరేషన్ లో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిపోయింది. దానివల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియా వల్ల తన లైఫ్ లో ఎదురైనా చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఆమె.. సోషల్ మీడియా ప్రభావం తనపై ఎలాంటి ప్రభావం చూపించిందో వివరించింది. నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబంనుండి వచ్చాను కాబట్టి స్కూల్ దశ నుండే నా చుట్టూ ఫొటో గ్రాఫర్లు ఉండేవారు.

ఎక్కడికైనా వెళ్లాలంటే భయమేసేది. పర్మిషన్ లేకుండా వెంటపడి ఫొటోలు తీసేవారు. ఒకసారి మా స్కూల్ ముందు కెమెరాలు పట్టుకుని వెయిట్ చేస్తున్న వారిపై నేను సీరియస్ అయ్యాను. అందుకు ప్రతీకారంగా నా ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశారు. దానివల్ల చాలామంది పిల్లలు కొంతకాలం నాతో డిస్టెన్స్ మెయింటెన్ చేశారు. నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళిగా మాట్లాడేవారు. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను.. అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ..

‘‘టెక్నాలజీ వృద్ధి చెందుతోన్న ఈ రోజుల్లో మార్ఫింగ్, ఫేక్‌ ఫొటోలు ఎక్కువవుతున్నాయి. మార్ఫింగ్‌ ఫొటోలు చూసి.. అవి నిజమేనని కొంతమంది అనుకుంటున్నారు. ఆ విషయం నన్నెంతో బాధపెడుతోంది. టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ఫొటోలను మార్ఫింగ్‌ చేసి.. అశ్లీల వెబ్‌సైట్స్‌లో ఉపయోగించారు. విషయం తెలిసి నేను కంగారుపడ్డా’’ అని ఆమె చెప్పారు. ధడక్ సినిమాతో 2018లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఆ సినిమా పర్లేదనిపించింది.

ఆ తర్వాత 2020లో గుంజన్‌ సక్సెనాతో వచ్చింది. ఈ చిత్రం ఓటిటిలో విడుదలై.. పర్లేదనిపించింది. ఇక ఆ తర్వాత జోయా అక్తర్‌ ఘోస్ట్‌ సిరీస్‌లో కూడా కనిపించారు.. ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది జాన్వీ కపూర్. దాంతో పాటు రామ్ చరణ్, సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్టు సమాచారం.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus