Janhvi Kapoor: దేవరకొండ ఫ్యామిలీతో జాన్వీ బాండింగ్!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ‘లైగర్’ సినిమా రిలీజ్ కావడానికి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. చాలా మంది హీరోయిన్లు విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుందని పబ్లిక్ గానే చెప్పారు. జాన్వీకపూర్ కి కూడా విజయ్ అంటే ఇష్టం. తెలుగులో తన ఫేవరెట్ స్టార్స్ లిస్ట్ లో విజయ్ పేరు కూడా చెబుతుంది.

అంతేకాదు ఒక సందర్భంలో ‘మీకు ఒకవేళ స్వయంవరం ఏర్పాటు చేస్తే ఇండస్ట్రీ నుంచి అందులో ఎవరు పాల్గొనాలని కోరుకుంటారు..?” అనే ప్రశ్న అడగ్గా.. ఆమె విజయ్ దేవరకొండ పేరుని కూడా ప్రస్తావించింది. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు జాన్వీకపూర్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీల మధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడింది. ఇటీవలే విజయ్ ఓ యాడ్ షూటింగ్ కోసం ముంబైకి వెళ్లారు.

ఆ యాడ్ లో జాన్వీకపూర్ కూడా నటించింది. ఈ సందర్భంగా విజయ్ తల్లి జాన్వీని కలిసింది. ఈ సందర్భంగా దిగిన ఫోటో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. షూటింగ్ తరువాత విజయ్ కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించిందట జాన్వీ. విజయ్, జాన్వీ కలిసి సినిమా చేస్తే బావుటనుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికైతే సినిమా సెట్ అవ్వలేదు కానీ ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహం కుదిరింది.

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు విజయ్ దేవరకొండ.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus