Janhvi Kapoor, Akhil: అఖిల్‌ నాయికగా తారక్‌ హీరోయిన్‌.. దాదాపు ఫిక్స్‌ అంటున్నారు!

cయితే ఇప్పుడు రేసులోకి మరో దర్శకుడు వచ్చారు. అయితే ఈసారి కొత్త దర్శకుడు పేరు వినిపిస్తోంది. ఆ విషయం తర్వాత మాట్లాడొచ్చు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌ పాయింట్ ఏంటి అంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనేది. ఆలూ లేదూ చూలూ లేదు.. అనే సామెత తరహాలో… సినిమా ఇంకా అనౌన్స్‌ కాకుండానే ఓ హీరోయిన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

అయితే, ఆ హీరోయిన్‌ ఓకే అయితే చాలు అని అఖిల్‌ ఫ్యాన్స్‌ కూడా భలే సరదాగా ఉన్నారు. అంత క్రేజీ హీరోయిన్‌ ఎవరబ్బా అనుకుంటున్నారా? ఇంకెవరు జూనియర్‌ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌. అవును, అఖిల్‌ కొత్త సినిమా కోసం జాన్వీని కాంటాక్ట్‌ చేశారు అని ఓ వార్త టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ విషయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

‘ఏజెంట్’ సినిమా సెట్స్ మీద ఉండగానే అఖిల్ నెక్స్ట్‌ సినిమా ఫిక్స్‌ అయిపోయింది. #Akhil6 యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ మీద ఉంటుందని చెప్పేశారు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అయితే తాజాగా ఈ సినిమాకు అనిల్ కుమార్ అనే ఓ డెబ్యూ డైరక్టర్‌ పని చేస్తారు అని తెలుస్తోంది. గతంలో యూవీ క్రియేషన్స్‌లో ప్రభాస్ ‘సాహో’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ కమ్‌ రైటర్‌గా పని చేశారు. ఇప్పుడు అఖిల్ కోసం ఫాంటసీ డ్రామా రెడీ చేశారట.

ఆ సినిమాలో హీరోయిన్‌గా (Janhvi Kapoor) జాన్వీ కపూర్‌ను అనుకుంటున్నారట. ఇటీవల సినిమా టీమ్‌ జాన్వీని కలిసి కథ చెప్పిందని, నచ్చడంతో ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ ఉండొచ్చని టాక్‌. అయితే జాన్వీ తెలుగులో రెండో సినిమా రామ్‌చరణ్‌తో చేయొచ్చని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడు అఖిల్‌ సినిమా లైన్‌లోకి వచ్చింది. దీంతో రెండో సినిమా ఏంటి అనే చర్చ మొదలైంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus