Jani Master: జైలు నుండి విడుదలయ్యాక ఫస్ట్ టైం మైక్ పట్టుకున్న జానీ మాస్టర్.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

జానీ మాస్టర్ (Jani Master) ఇటీవల జైలు శిక్ష అనుభవించి వచ్చిన సంగతి తెలిసిందే. మైనర్ కొరియోగ్రాఫర్ Liగిక ఆరోపణల కేసులో 37 రోజుల పాటు అతను జైలు జీవితం గడిపి వచ్చాడు. ఇతని కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతనిపై చాలా వ్యతిరేకత నెలకొంది.అందువల్ల అతనికి దక్కాల్సిన నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ అయ్యింది. ప్రస్తుతం జానీ మాస్టర్ ఖాళీగానే ఉన్నాడు. అతను ఏ సినిమాలకి పనిచేయడం లేదు. మీడియాకి కూడా దూరంగా ఉంటూ వచ్చాడు.

Jani Master

అయితే నిన్న సోమవారం నాడు జబర్దస్త్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ (కేశవ్ చంద్ర రమావత్) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్లో అతను మైక్ అందుకుని తన కష్ట కాలాన్ని గుర్తుచేసుకున్నాడు. జానీ మాస్టర్ మాట్లాడుతూ.. ఇటీవల నా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఇలా జరిగినప్పుడు సాధారణంగా ఎవ్వరూ బయటకు రాలేరు. కానీ నన్ను చాలా మంది నమ్మారు. మీ ఇంట్లో బిడ్డలా నాకు అండగా నిలబడ్డారు.

నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు పెట్టుకున్న నమ్మకం ఎక్కడికి పోదు.. త్వరలోనే అన్ని నిజాలు తెలుస్తాయి. భర్తకు భార్యే పెద్ద బలం. నా ఈ కష్టకాలంలో నా భార్య నా వెన్నంటి ఉంది. నాకు వెన్నెముకలా నిలిచింది.నా భార్య లేకపోతే నేను ఈరోజు ఇలా మీ ముందు ఉండే వాడిని కాదేమో. భర్తల్ని మంచి దారిలో నడిపించేది భార్యలే’ అంటూ భార్య అయేషాని స్టేజి పైకి పిలిచి ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు.

అటు తర్వాత ‘జబర్దస్త్’ రాకేష్.. ” మాస్టర్ మనకి నేషనల్ అవార్డు వచ్చేసింది. కొట్టాం కదా చాలు..! నా నెక్స్ట్ సినిమాకి ఓ సాంగ్ కొరియోగ్రఫీ చేసి పెడతారా?” అంటూ అడిగాడు. అందుకు జానీ మాస్టర్.. ‘ఒక్క సాంగ్ కాదు.. సినిమాలోని అన్ని సాంగ్స్ కి నేను కొరియోగ్రఫీ చేసి పెడతా’ అంటూ సమాధానం ఇచ్చాడు.

‘గేమ్ ఛేంజర్’ బిజినెస్ పై టీజర్ ఎఫెక్ట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus