‘జాతిరత్నాలు’తో యువతను విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుడు అనుదీప్. సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో అనుదీప్ చాలా ఫేమస్ అయిపోయాడు. అతని మాటలు, చేష్టలు, స్పాంటేనియస్ జోకులు… ఇలా అన్నీ అలరించాయి. అందుకు తగ్గట్టే సినిమా కూడా అలరించింది. సినిమా ఫలితం చూశాక వరుస సినిమాలు చేసేస్తాడు అనిపించింది. కానీ పరిస్థితి అలా లేదు. కొత్త సినిమా త్వరగా ఓకే అవ్వలేదు. ఎట్టకేలకు సినిమా ప్రారంభమైంది. అయితే ఇక్కడ కాదు.
‘జాతి రత్నాలు’ తర్వాత అనుదీప్ కొత్త సినిమా ఏంటి అనే చర్చ వచ్చినప్పుడల్లా… ఇక్కడా? లేకపోతే కోలీవుడ్‌లోనా? అనే ప్రశ్న వచ్చేది. దానికి కారణం ఆయన ఆ మధ్య చెన్నై వెళ్లి ఓ హీరోకు కథ చెప్పాడనే వార్తలు రావడమే. అక్కడికి కొద్ది రోజులకు ఆ కథ చెప్పింది శివకార్తికేయన్‌కే అనే వార్తలొచ్చాయి. దాంతోపాటు శివకార్తికేయన్ తన తర్వాతి చిత్రం తెలుగు నిర్మాతలకే చేస్తున్నాడు అని పుకార్లు వచ్చాయి. దీంతో అనుదీప్ నెక్స్ట్ తెలుగు, తమిళ్ బైలింగ్వుల్ అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు అదే నిజమైంది.
యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగి తమిళంలో స్టార్ హీరోగా మారిన కథానాయకుడు శివకార్తికేయన్. తెలుగులోనూ శివకార్తికేయన్‌కు మార్కెట్ ఉంది. డబ్బింగ్ సినిమాలకు మంచి ఆదరణే దక్కుతోంది. ఇటీవల వచ్చిన ‘డాక్టర్’ డబ్బింగ్ సినిమా ‘వరుణ్ డాక్టర్’ బాగానే ఆడింది. దీంతో తెలుగులో మార్కెట్‌ను క్యాష్ చేసుకోవడానికి శివ కార్తికేయన్ సినిమా చేయాలని అంగీకరించారు. ఆ సినిమా ఇటీవల పూజా కార్యక్రమంతో తమిళనాడులోని కారైక్కుడిలో మొదలైంది. కారైక్కుడి, పుదుచ్చేరిలో ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ సినిమా చిత్రీకరణ పూర్తి చేయనున్నారు.
శివకార్తికేయన్‌కి ఇది 20వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్, శాంతి టాకీస్ కలసి నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇటీవల కాలంలో తమిళ హీరోలతో తెలుగు నిర్మాతలు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆ హీరోల మార్కెట్ ఇక్కడ పెరుగుతుంది, అలాగే మన నిర్మాతలకు అక్కడ తమిళంలో మార్కెట్ వస్తుంది.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!