‘ఉప్పెన’ హీరో బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడుగా..!

ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ ‘జాతి రత్నాలు’ చిత్రాలు బ్లాక్ బస్టర్లు అయిన సంగతి తెలిసిందే. మీడియం రేంజ్ సినిమాలు అయినప్పటికీ ఇవి పెద్ద విజయాలనే నమోదు చేసాయి. ఇప్పుడు ‘జాతి రత్నాలు’ డైరెక్టర్ తో ‘ఉప్పెన’ హీరో చేతులు కలుపబోతున్నాడట. అవును దర్శకుడు అనుదీప్‌ తో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఓ మూవీ చేయబోతున్నాడని తాజా సమాచారం.ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. ‘ఎస్వీసిసి’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్‌ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నాడట.

ఇందుకు గాను కొంత అడ్వాన్స్ ను కూడా‌ వీళ్లకు చెల్లించాడని తెలుస్తుంది. గతేడాది వైష్ణవ్ తేజ్ అన్నయ్య సాయి తేజ్ తో ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని నిర్మించి హిట్ అందుకున్నాడు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. ఇప్పుడు తమ్ముడితో కూడా సినిమా చేయబోతున్నట్లు స్పష్టమవుతుంది. ఇక వైష్ణవ్ ప్రస్తుతం క్రిష్‌ జాగర్లమూడి నిర్మాణంలో ఓ మూవీ చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే అనుదీప్ డైరెక్షన్లో కొత్త సినిమాని మొదలుపెడతాడని తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే..

వీరిద్దరికీ ఇది మూడో చిత్రమే..! అనుదీప్ మొదట ‘పిట్ట గోడ’ అనే సినిమాని తెరకెక్కించాడు. అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ‘జాతి రత్నాలు’ చిత్రంతో తాను అనుకున్న హైట్స్ కు రీచ్ అయ్యాడు. ఈ చిత్రం ఆల్రెడీ డబుల్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా.. ఇప్పటికీ స్ట్రాంగ్ గా రన్ అవుతుండడం విశేషం.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus