‘పఠాన్’ తర్వాత బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘జవాన్’. సెప్టెంబర్ 7న అంటే ఈరోజు హిందీ, తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ‘పఠాన్’ సినిమా వెయ్యి కోట్లు పైనే వసూల్ చేయడంతో ‘జవాన్’ పై అంచనాలు భారీగా పెరిగాయి.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించారు.ఇక ఈ చిత్రానికి తొలి షోతోనే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ఓపెనింగ్స్ భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే వర్షాల ఎఫెక్ట్ వల్ల ఈ సినిమాని అందరూ వీక్షించే అవకాశాలు కొంచెం తక్కువే. అందుకని కొంతమంది ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘జవాన్’ (Jawan) ఓటీటీ రైట్స్ ని భారీ రేటు చెల్లించి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అయితే ఎప్పటి నుండి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? అనేది మరో ప్రశ్న. సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది. కాబట్టి 3 , 4 వారాల పాటు థియేటర్ల వద్ద ఈ సినిమా సందడి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నాలుగు వారాల తర్వాత అంటే అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!