Jd Chakravarthy: నా బలం తెలుగు చిత్ర పరిశ్రమే… జెడి కామెంట్స్ వైరల్!

జెడి చక్రవర్తి చాలా రోజుల తర్వాత ఈయన తిరిగి దయ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 4వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా జేడి చక్రవర్తి తన కెరియర్ గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇక ఈ వెబ్ సిరీస్ కోసం చాలా రోజులుగా తనని అడుగుతూ ఉన్నప్పటికీ తాను మాత్రం చేయలేను అనే విషయం చెప్పకుండా దాటేస్తూ వస్తున్నాను కానీ నన్ను మాత్రం వదలకపోవడంతో డైరెక్టర్ పవన్ సాదినేని తనని అడుగుతూ ఉండడంతో కథ చెప్పమని అడిగాను. అయితే ఈయన కేవలం ఫోన్లో పదేపదే నిమిషాలలో కథ మొత్తం వినిపించడంతో తాను ఫోన్లోనే ఈ సిరీస్ కు ఓకే చెప్పానని తెలియజేశారు.

ఈ సిరీస్ ఓకే చెప్పడానికి ఆర్జీవి కూడా కారణం అని తెలిపారు. ఆయన ఎప్పుడు చెబుతూ ఉండేవారు ఒక డైరెక్టర్ పదినిమిషాలలో కథ చెప్పారు అంటే ఆ కథ పై ఆయనకు పట్టు ఉన్నట్లేనని వర్మ చెప్పేవారు. పవన్ సాదినేని కూడా అలా చెప్పడంతో నేను వెంటనే ఈ సిరీస్ కి కమిట్ అయ్యానని తెలిపారు. ఇక జెడి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి కూడా జెడి చక్రవర్తి పలు విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా జెడి చక్రవర్తి (Jd Chakravarthy) బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు నాకు ఒక పొరుగిల్లు లాంటిదే అందుకే కొంతకాలం అక్కడికి వెళ్లి తిరిగి తెలుగు చిత్ర పరిశ్రమకే వచ్చాను. తెలుగు చిత్ర పరిశ్రమ నా బలం అందుకే తిరిగి తెలుగులో పలు అవకాశాలను అందుకొని బిజీ అయ్యానని ఈ సందర్భంగా జెడి చక్రవర్తి తన కెరియర్ గురించి అలాగే బాలీవుడ్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమల గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus