భాష – ప్రాంతం గురించి భలే చెప్పారు జేడీ చక్రవర్తి!

  • May 10, 2022 / 12:51 PM IST

పాన్‌ ఇండియా సినిమాల ప్రభావంతో సినిమా ఇండస్ట్రీలో ఓ వారం క్రితం పెద్ద వెర్బల్‌ వార్‌ జరిగింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌, శాండిల్‌ వుడ్‌ స్టార్‌ హీరో సుదీప్‌ మధ్య జరిగిన ట్విటర్‌ డిస్కషన్‌ గురించి మీకు తెలిసే ఉంటుంది. ‘జాతీయ భాషగా హిందీ’ అనే అంశం గురించి చినికి చినికి గాలివానలా మొదలై… చిన్నపాటి తుపానులా కనిపించింది. అయితే మధ్యలోనే ఆ మాటల యుద్ధం సమసిపోయింది. కానీ ఓ సినిమా ట్రైలర్‌లోని డైలాగ్‌తో మళ్లీ లాంగ్వేజ్ వార్‌ వైరల్‌ అవుతోంది.

బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో దర్శకుడు అనుభవ్ సిన్హా ‘అనేక్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో జేడీ చక్రవర్తి కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. అందులో ఆయుష్మాన్ ఖురానా, జేడీ చక్రవర్తికి మధ్య జరిగిన సంభాషణే ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ సన్నివేశంలో ఆయుష్మాన్ ఖురానా… ఒక వ్యక్తి ఇండియన్ అని ఎలా గుర్తిస్తారనే అనే టాపిక్‌ గురించి మాట్లాడతారు. ఈ క్రమంలో భాష గురించి ప్రస్తావన వచ్చింది.

ఆ వైరల్‌ సీన్‌లో ‘మీరు ఎక్కడివారు..?’ అని జేడీ చక్రవర్తిని అడుగుతాడు ఆయుష్మాన్. దానికి జేడీ ‘తెలంగాణ’ అని చెబుతాడు. ఆ తర్వాత కంటిన్యూ చేస్తూ ‘సౌత్’ అని కూడా అంటాడు. వెంటనే ఆయుష్మాన్.. ‘తెలంగాణ అంటే తమిళనాడుకి నార్త్ లో ఉంటుందని.. తమిళనాడు జనాలు మిమ్మల్ని నార్త్ ఇండియన్ అని పిలవాలి’ అని అంటారు. దానికి జేడీ ‘బహుశా’ అని బదులిస్తాడు. ఆ తర్వాత ఆయుష్మాన్‌ మాట్లాడుతూ ‘నేను ఎక్కడ వాడినని మీరు అనుకుంటున్నారు..?’ అని జేడీని అడుగుతాడు.దానికి జేడీ మాట్లాడుతూ నార్త్ ఇండియా అని చెబుతాడు. ‘అలా అనిపించింది’ అని రిటర్న్‌ అంటాడు ఆయుష్మాన్.

మీ హిందీ చాలా నీట్ గా ఉంది.. కాబట్టి అలా అనుకున్నాను అని కూడా చెబుతారు. నార్త్ వాళ్లు, సౌత్ వాళ్లు అనే విషయం హిందీ డిసైడ్ చేస్తోందన్నమాట అంటూ నిరాశగా చెబుతాడు ఆయుష్మాన్‌. దానికి జేడీ ‘నో’ అంటాడు. అయితే మరి ఎలా డిసైడ్ చేస్తారు. నార్త్ ఇండియన్ కాదు, సౌత్ ఇండియన్ కాదు, ఈస్ట్ ఇండియన్ కాదు, వెస్ట్ ఇండియన్ కాదు. ఒక వ్యక్తి కేవలం ఇండియన్ ఎలా అవుతారు..?’ అని ఆయుష్‌మాన్‌ ప్రశ్నిస్తాడు. సుదీప్, అజయ్ దేవగణ్‌ మధ్య జరిగిన హిందీ భాష డిబేట్ నేపథ్యంలో ఇప్పుడు ‘అనేక్’ సినిమా ట్రైలర్‌లోని ఆ సీన్‌ హాట్ టాపిక్‌గా మారింది.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!


అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus