Jeevitha, Jr NTR: నేను ఎవరికీ ఓటు వేయనంటున్న ఎన్టీఆర్!

మంచు మోహన్ బాబు కుమారుడిగా, కథానాయకుడిగా మంచు విష్ణు అందరికీ ఎంత సుపరిచితుడో.. ఒక నటుడిగా, వ్యక్తిగా ప్రకాష్ రాజ్ కూడా ఫిలిమ్ సర్కిల్లో అందరికీ అంతే సుపరిచితుడు. అలాంటి ప్రకాష్ రాజ్ ను ఔట్ సైడర్ అనడం, అలాగే మంచు విష్ణు సినిమాలకు ప్రకాష్ రాజ్ మీడియా ఛానల్స్ సాక్షిగా తక్కువ చేసి మాట్లాడడం వంటి విషయాలు ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళాయట.

ఈ ఏడాది మా ఎలక్షన్స్ జరుగుతున్న తీరు కానీ, ప్యానల్స్ చేస్తున్న ప్రచారం కానీ తనకు ఏమాత్రం నచ్చడం లేదని, దయచేసి తనను ఈ ఎలక్షన్స్ లో ఓటు వేయమని అడగొద్దని, తానెవరికీ ఓటు వేయనని చెప్పేశాడట జూనియర్ ఎన్టీఆర్. నిజమే.. తిప్పి కొడితే రెండేళ్ల టర్మ్ కోసం మరీ ఇంతలా తిట్టుకు చావాలా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తోంది ప్రస్తుతం మా ఎలక్షన్స్ నిర్వహించబడుతున్న తీరు. ఇటీవల తనకు సపోర్ట్ చేయమని ఎన్టీఆర్ ను కలిశారట జీవిత రాజశేఖర్. ఆ సమయంలో ఎన్టీఆర్ చెప్పిన విషయాల్ని ఆమె మీడియాతో పంచుకున్నారు.

ఎన్టీఆర్ మాత్రమే కాదు మిగతా స్టార్ హీరోలు కూడా మా ఎలక్షన్స్ పై ఇదే భావనతో ఉన్నారు. అందుకే ఎవరూ పబ్లిక్ గా ఎవరినీ సపోర్ట్ చేయడం లేదు. ప్రకాష్ రాజ్ ప్యానల్ గెలుస్తుందా లేక మంచు విష్ణు ప్యానల్ గెలుస్తుందా అనే విషయానికి సమాధానం త్వరలోనే తెలిసిపోతుంది కానీ.. ఇప్పటివరకూ మా అసోసియేషన్ చరిత్రలో జరగనంత రచ్చ ఈ ఎలక్షన్స్ విషయంలో జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus