టాలీవుడ్‌లో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు రెండే. ఒకటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు, రెండో డ్రగ్స్ కేసు. తొలి విషయం మీద జీవిత ఏం స్పందించిందో ఇంతకుముందే చదివి ఉంటారు. రెండో అంశమైన డ్రగ్స్ కేసు గురించి కూడా జీవిత స్పందించారు. డ్రగ్స్ విషయంలో ‘మా’ తరఫున తీసుకోవాలనుకుంటున్న విధానాల్ని కూడా జీవిత తెలిపారు. సమాజంలో ఉన్నవారందరితో పోలిస్తే… చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వాడే వాళ్లు తక్కువ మందే ఉంటారు.
అయితే సినిమా అనగానే గ్లామర్ ప్రపంచం కాబట్టి… అందరి దృష్టి నటీనటులు మీదే ఉంటుంది అని జీవిత డ్రగ్స్ కేసు గురించి స్పందించారు. దీంతోపాటు ఏ విషయమైనా సరే దయచేసి సినిమా వాళ్లపై రాళ్లు విసరొద్దు అని అందరినీ అభ్యర్థించారు. తప్పు చేసిన వాళ్లకు తప్పకుండా శిక్షపడాలన్న జీవిత… అయితే, తప్పు చేశాడా? లేదా? అన్న స్పష్టత రాకుండా ఎవరినీ టార్గెట్ చేయొద్దు అని కోరారు జీవిత. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మా ప్యానెల్ గెలిస్తే, డగ్ర్స్ కేసు తదితర న్యాయ వివాదాలపై స్పష్టమైన వైఖరి అవలంబిస్తామని జీవిత చెప్పారు.
దీని కోసం ‘మా’లో లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని జీవిత చెప్పారు. దాని ద్వారా నటుల మర్యాద కాపాడటానికి పోరాడతామని ఆమె చెప్పారు. అంతేకాదు ఈ విషయంలో ప్రకాశ్‌రాజ్ చొరవ చూపిస్తున్నారని కూడా జీవిత చెప్పారు.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!