Bigg Boss 5 Telugu: ఈవారం జెస్సీ ఇంటికి వెళ్లిపోతున్నాడా..? కారణం ఏంటి..?

బిగ్ బాస్ హౌస్ లో జెస్సీ ఎలిమినేట్ అవ్వబోతున్నాడా..? ఇంటికి వెళ్లిపోతున్నాడా అంటే నిజమే అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అసలు మేటర్లోకి వెళితే, బిగ్ బాస్ 10వ వారం నామినేషన్స్ లో భాగంగా జైల్లోకి వెళ్లిన జెస్సీని సిరి కీస్ తీస్కుని మరీ సేవ్ చేసింది. అయితే, చాలాసేపు ఒకే ప్లేస్ లో నిలుచుని ఉన్న జెస్సీ ఒక్కసారిగా కళ్లుతిరిగి పడిపోయాడట. దీంతో ఎమెర్జన్సీ రూమ్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. గత వారం రోజుల నుంచీ జెస్సీ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

తను సంచాలక్ గా ఉన్నప్పటి నుంచీ ఈ సమస్యని ఎదుర్కుంటున్నాడు. దీని గురించి లాస్ట్ వీక్ నాగార్జున అడిగినా సెట్ అయ్యిందనే చెప్పాడు. కానీ, టాస్క్ లో మాత్రం 100 శాతం ఫిట్ నెస్ తో పార్టిసిపేట్ చేయలేకపోయాడు. అయితే, ఇప్పుడు కళ్లు తిరిగి పడిపోవడంతో డాక్టర్స్ ని పిలిపించి ప్రత్యేకమైన రూమ్ లో ఉంచి చికిత్స చేయిస్తున్నారట. అంతేకాదు, అవసరం అయితే హాస్పిటల్ కి సైతం తీస్కుని వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. లాస్ట్ సీజన్ లో ఇలాగే గంగవ్వకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినపుడు ఎలిమినేట్ చేసేశారు. అలాగే, నోయల్ కూడా కాళు నొప్పితో ఇంటి నుంచీ బయటకి వచ్చేశాడు.

ఇప్పుడు ఈసీజన్ లో జెస్సీ హెల్త్ ప్రాబ్లమ్ తో ఇంటి నుంచీ బయటకి వచ్చేస్తాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఈవారం జెస్సీ ఇంటి నుంచీ వచ్చేస్తే , ఈవారం ఎలిమినేషన్ ఉండదనే చెప్తున్నారు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం 10వ వారం నామినేషన్స్ లో మొత్తం 5గురు ఇంటిసభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో సిరి, రవి, సన్నీ, మానస్ లతో పాటుగా కాజల్ కూడా ఉంది. ఒకవేశ ఈవారం ఎలిమినేషన్ లేకపోతే మాత్రం అందరూ సేఫ్ అయినట్లే అవుతుంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus