హాలీవుడ్ నటీనటులు, మాజీ దంపతులు జానీ డెప్, అంబర్ హెర్డ్‌ల పరువు నష్టం కేసు ఇటీవల ఓ కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో అంబర్ హెర్డ్ ఆరోపణలు తప్పని జ్యూరీ గుర్తించింది. దీంతో నటుడు జానీ డెప్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. జానీ పరువుకు భంగం కలిగించినందుకుగానూ ఆయనకు హెర్డ్ 15 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అదే సమయంలో హెర్డ్‌కు కూడా డెప్ 2 మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు చెప్పింది.
దీంతో తనకు కలిగిన ఊరటను జానీ డెప్ పార్టీ రూపంలో సన్నిహితులతో పంచుకున్నాడట. ఈ పార్టీ ఖరీదు 48 లక్షల రూపాయలు అని సమాచారం. అంటే వారి కరెన్సీలో 62 వేల డాలర్లు. ఆదివారం సాయంత్రం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉన్న ‘వారణాసి’ అనే రెస్టరెంట్‌ను పార్టీ కోసం ఎంచుకున్నాడట జానీ డెప్. బర్మింగ్‌హామ్‌లో ‘వారణాసి’ అతిపెద్ద భారతీయ రెస్టారెంట్. ఈ పార్టీలో భారతీయ వంటకాలు, కాక్‌టెయిల్స్, రోజీ షాంపెయిన్ వంటివి అనేక వంటకాలను ఏర్పాటు చేశారట.
ఈ విందు కోసం డెప్ ఏకంగా 62,000 డాలర్లను ఖర్చు చేశాడని సమాచారం. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.48 లక్షలు అని అర్థం. ఆ పార్టీ సమయంలో డెప్ చాలా సంతోషంగా కనిపించాడట. పార్టీకి ముందు డెప్ భద్రతా సిబ్బంది సిటీ సెంటర్‌లోని ఆ రెస్టారెంట్‌ను పూర్తిగా తనిఖీ చేసి ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఎంపిక చేశారట. ఈ పార్టీపై రెస్టారెంట్ మేనేజర్ మహమ్మద్ హుస్సేన్ కొన్ని వివరాలు చెప్పారు.
ఆదివారం సాయంత్రం డెప్ తన మిత్రులతో కలిసి వస్తారని ఓ ఫోన్ వచ్చింది. తొలుత అది జోక్ అనుకున్నాం. కానీ ఆయన భద్రతా సిబ్బంది వచ్చి తనిఖీలు చేశాక నిజమే అని అర్థమైంది అని చెప్పారు. ఇక ఆ విందులో శీష్ కబాబ్, చికెన్ టిక్కా, పనీర్ టిక్కా మసాలా, ల్యాంబ్ కరాహీ, కింగ్ తందూరీ ప్రాన్స్ వంటివి వంటకాలను అందించారట. బిల్లు ఎంతో కచ్చితంగా చెప్పకపోయినా.. ఐదంకెల మొత్తం అయితే ఉంటుందని మేనేజర్ చెప్పారు.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!