Jr NTR: 3 హిట్లు కొట్టిన బావమరిది విషయంలో ఎన్టీఆర్ స్పెషల్ కేరింగ్..!

ఎన్టీఆర్ (Jr NTR) బావమరిదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు నార్నె నితిన్ (Narne Nithin). తన డెబ్యూ మూవీ ‘మ్యాడ్’ తో (MAD)  మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన ‘ఆయ్’ (AAY) కూడా హిట్టే. ఇక ఇటీవల వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) కూడా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇలా నార్నె నితిన్ హ్యాట్రిక్ సక్సెస్ లు కొట్టిన యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతనికి మార్కెట్ కూడా స్టాండర్డ్ అయ్యింది. అతనిపై మినిమమ్ బడ్జెట్ పెట్టి సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు.

Jr NTR

నార్నె నితిన్ కెరీర్ కి అతి కీలకమైన టైం ఇది. ఇలాంటి టైంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే కెరీర్ గాడి తప్పుతుంది. ఆ తప్పు నార్నె నితిన్ చేయకూడదు అని అతని బావ ఎన్టీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇటీవల నార్నె నితిన్ కి ఎన్టీఆర్ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారట. అదేంటంటే.. మూడు హిట్లు పడ్డాయి కదా అని.. కొంచెం పెద్ద స్కేల్ సినిమాల ఆఫర్లు నార్నె నితిన్ కి కచ్చితంగా వస్తాయి. కానీ వాటికి ఓకే చెప్పొద్దని ఎన్టీఆర్.. సూచించాడట.

యూత్ లో నార్నె నితిన్ కి పాపులారిటీ వచ్చింది. తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పడే సినిమాలు చేయమని ఎన్టీఆర్ చెప్పాడట. నార్నె నితిన్ సినిమాల్లో విషయం ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ ఆడియన్స్ కి వచ్చి.. టికెట్ కొనడానికి వాళ్ళు రెడీ అయినప్పుడు.. ‘ఎలాంటి ప్రయోగాలైనా చేయొచ్చనే’ విలువైన సలహాని ఎన్టీఆర్.. నితిన్ కి ఇచ్చినట్లు సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus